చిన్న వయసు పెద్ద మనసు - యుఎస్ సిటిజన్ ఔదార్యం
టెక్నాలజీలో ముందంజలో ఉన్నా ఇండియాలో మాత్రం మహిళలల్లో అత్యధిక శాతం ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. విద్యా పరంగా, ఆరోగ్య పరంగా , సామాజికంగా ఇంకా వివక్షకు లోనవుతున్నారు. కొందరు పురిట్లోనే చనిపోతుంటే..మరికొందరు చెప్పుకోలేని రోగాలకు లోనవుతున్నారు. ప్రతి నెలా వచ్చే నెలసరి విషయంలో వాడే లోదుస్తులు అంటే న్యాప్‌కిన్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది.
ప్రతిసారి 900 టన్నులకు పైగా న్యాప్‌కిన్‌లు అవసరమవుతాయని అంచనా. కుటుంబ వ్యవస్థను బతికిస్తూ..రేయింబవళ్లు శ్రమించే మహిళల పట్ల ఇంకా చులకనగా చూస్తోంది ఈ సమాజం. అండగా నిలవాల్సిన పురుషులు సైతం వీరిని మనుషులుగా కాకుండా వస్తువులుగా, కోరికలు తీర్చే బొమ్మలుగా చూస్తున్నారు.
గతంలో నెలసరి వస్తుందనే సరికి..దానినో అపవిత్రమైనదిగా భావించే వారు. రాను రాను మార్పులు చోటు చేసుకోవడంతో..ఇంట్లో దుస్తులు వాడే వారు. ఇపుడది మారింది..కొంత మార్పు వచ్చింది. ప్రతి నెలా వచ్చే ఆ నాలుగు రోజులు నరకం. న్యాప్‌కిన్లు అవసరమవుతాయి. బడా కంపెనీలు స్టే ఫ్రీ, తదితర వాటితో మార్కెట్లో ఉన్నప్పటికీ అవి కొందరికే, కొన్ని కుటుంబాలకే పరిమితమై ఉన్నాయి.
అడవుల్లో, ఊర్లలో ఇంకా వీటి వాడకం పట్ల ..ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మహిళలకు ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకుండా పోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని గుర్తించిన తమిళనాడుకు చెందిన మురుగనాదం ఓ చరిత్ర సృష్టించారు. తన భార్య ప్రతి నెలా పడే ఇబ్బందులను ఆయన దగ్గరుండి చూశారు. నెలసరి నేరం కాదు..అది ప్రకృతి కార్యం. పునర్ సృష్టికి ప్రతిరూపమే ఇది.
మహిళలు వాడే లోదుస్తుల వల్ల రోగాలకు గురవుతున్నారని బాధ పడిన మురుగనాదం.ఏకంగా వారి కోసం ప్రత్యేకంగా తక్కువ ఖర్చుతో న్యాప్‌కిన్లను తయారు చేసే యంత్రాలను రూపొందించారు. ఆయన చేసిన కృషికి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుండి భారీ ఎత్తున ప్రచారం లభించింది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించాయి. బెస్ట్ ఇన్నోవేటివ్ క్యాండిడేట్‌గా పేరొందారు. మహిళల్లో అవగాహన కల్పించేందుకు ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ..ప్యాడ్ మ్యాన్ పేరుతో సినిమా తీశారు. భారీ విజయాన్ని సాధించారు.
న్యాప్ కిన్ల వాడకం విషయంలో కొన్ని దిగ్భ్రాంతికర వాస్తవాలు బయట పడ్డాయి. 23 శాతం మంది బాలికలు ..ఈ నెలసరి తట్టుకోలేక పాఠశాలలకు దూరమయ్యారు. 70 శాతం మంది మహిళలు ప్రతి నెలా వచ్చే రుతుక్రమం నుండి రక్షించుకునేందుకు న్యాప్‌కిన్లను కొనేందుకు డబ్బులు లేవు. 88 శాతం మంది మహిళలు దేశ వ్యాప్తంగా ప్రమాదకరమైన న్యాప్‌కిన్లను వాడుతున్నారని వెల్లడైంది.
మహిళలు ఎదుర్కొంటున్న ఈ బాధలను ఓ స్వచ్చంధ సంస్థ ద్వారా తెలుసుకున్న అమెరికాకు చెందిన క్రిస్టిన్ ఇండియాను సందర్శించింది. ఆమె తోడ్పాటుతో ఎలాంటి ప్రమాదకరం లేని న్యాప్ కిన్లను అందజేసేందుకు శ్రీకారం చుట్టింది. సాథి అనే సంస్థ ఉత్తరాఖండ్‌ను ఎంచుకుంది. అమ్రితా సెగల్, గ్రేస్ కానే, జాస్ రోజ్ తో కలిసి సాథి చేపట్టిన కార్యక్రమాలను చూసి చలించారు.
ముఖ్యంగా క్రిస్టిన్ ఆరోగ్యకరమైన న్యాప్ కిన్లను ఎందుకు ఇవ్వలేం అంటూ ప్రశ్నించారు. ఆ దిశగా కృషి చేసింది సాథి. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో..రోజూ వారీగా అరటి పండ్ల గుజ్జు ద్వారా న్యాపికిన్లను తయారు చేశారు. దీనితో తయారైన న్యాప్ కిన్లను వాడేలా మహిళలను చైతన్యవంతం చేశారు. అక్కడి మహిళలు ముందు వాడేందుకు ఒప్పుకోలేదు. అష్టకష్టాలుపడి వాళ్లను ఒప్పించారు.
ప్రతి నెలా వీరు తయారు చేసిన న్యాప్ కిన్లను వాడేలా చేశారు. కొంత మార్పు వచ్చింది. ఆరోగ్యం మెరుగైంది. స్టెం కాలేజీ లో చదువుతున్న పిల్లలకు వీటిని గుర్తించేలా చూశారు. ఇక్కడి వారు అమెరికా జపం చేస్తుంటే..ఈ అమెరికన్ లేడి మాత్రం ఇండియన్ వుమెన్స్ పాలిట దేవతగా మారింది. వేల మందితో మార్పు రాదు..ఒక్కరితోనే స్టార్ట్ అవుతుందని ఈమెను చూస్తే తెలుస్తుంది కదూ..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి