అంద‌మే ఆనందం..ఆటే వ్యాపారం

అంద‌మే ఆనందం..ఆనంద‌మే జీవిత మ‌క‌రందం అన్న సినీ క‌వి మాట‌లు అక్ష‌రాల నిజ‌మ‌వుతున్నాయి. అందం చూడ‌వ‌యా..ఆనందించ‌వ‌యా అన్న సాంగ్ కూడా వీరిని చూసి ఎంచ‌క్కా పాడుకోవ‌చ్చు. ప్ర‌తి రోజూ వ‌చ్చే యాడ్స్‌ల‌లో ఫేమ‌స్ ప‌ర్స‌నాలిటీస్ న‌టిస్తున్నారు. కోట్లు వెన‌కేసుకుంటున్నారు. ఇండియాలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి కంట్రీలో సినీరంగం, క్రీడారంగానికి చెందిన వారే కీల‌కంగా భూమిక పోషిస్తున్నారు.
వీరికి ల‌క్ష‌ల్లో..కోట్ల‌ల‌లో ఫ్యాన్స్ విశ్వ‌వ్యాప్తంగా ఉన్నారు. వీరినే బ‌డా కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఎన్ని డ‌బ్బులైనా ఖ‌ర్చు చేసేందుకు సై అంటున్నాయి. వీరిని బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా పెట్టుకునేందుకు పోటీ ప‌డుతున్నారు.
దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క పెట్టుకోవాల‌న్న ఆలోచ‌న‌నే ఇంప్లిమెంటేష‌న్ చేస్తున్నారు ప్లేయ‌ర్లు, న‌టీన‌టులు. ప్ర‌పంచ వ్యాప్తంగా సాక‌ర్ పోటీల్లో అంద‌మైన ప్లేయ‌ర్లుగా ముద్ర ప‌డిన వారిలో జూలియా సిమిక్‌, సిడ్నే లారెక్స్‌, హోప్ సోలో, న‌టాలీ వింటి, అనౌక్ హూజిండిక్‌, హెల్సీ పెర్రీ, జొనెల్లీ ఫెలింగో, లారెన్‌, న‌యేలి రాంజెల్‌, అలెక్స్ మోర్గాన్ పేరొందారు.
బ్యాడ్మింట‌న్ విష‌యానికొస్తే..అశ్విని పొన్న‌ప్ప‌, గోహ్ లీ యంగ్‌, క్రిస్టియానా పెడ‌ర్స‌న్‌, ర‌చాన‌క్ , పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌, క‌రోలినా మారిన్‌, జ్వాలా గుత్త ఉండ‌గా టెన్నిస్ విష‌యంలో అంద‌మైన ప్లేయ‌ర్స్ కే అభిమానులు ఎక్కువ ఓటు వేస్తున్నారు.
ష‌ర‌పోవా, సానియా మీర్జా, స్టెఫీ గ్రాఫ్‌, డోమ్నికా, మారియా కెరిలెంకో, మ్యాండీ మెనీలా, క‌రోలినా, ఎలీనా వెన్నిసా, అన్నా కోర్నికోవా, అన్నా ఇవానోవిక్‌, గాబ్రియేలా సెబాస్టిన్ ఉండ‌గా మ‌హిళా క్రికెట్ విష‌యానికి వ‌స్తే ..మిథాలీ రాజ్‌, లౌరా మార్స్‌, పాకిస్తాన్‌కు చెందిన సానా మీర్‌, ఆస్ట్రేలియాకు చెందిన పెర్రీ, ద‌క్షిణాఫ్రికాకు చెందిన మిగ్నాన్‌, డానేవాన్‌, లా పాల్ట‌న్‌, సారా, ఐర్లాండ్‌కు చెందిన జొయేస్‌, హోలీ ఫెర్లింగ్‌, సారా టేల‌ర్‌, రోసాలీ బిచ్ ఉన్నారు. ఇక ఇండియా విష‌యానికి వ‌స్తే లెక్క‌లేనంత మంది ఉండ‌డం విశేషం.
మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేయ‌ర్‌గా సానియా మీర్జా పేరు సంపాదించింది. ఈమె వ్యాపారం కోట్ల‌ల్లో ఉంటోంది. ఒకానొక స‌మ‌యంలో స‌చిన్ టెండూల్క‌ర్ ఓ వైపు..సానియా ఇంకో వైపు మార్కెట్‌ను శాసించారంటే అతిశ‌యోక్తి కాదు. జ్వాలా గుత్త‌, సునీతా రావు, ప్రాచీ తెహ్లాన్ తో పాటు కార్‌, బైక్ రేసులో దుమ్ము రేపుతున్న ప్లేయ‌ర్‌గా అలీషా అబ్దుల్లాకు ఉంది. దీపిక‌, అశ్విని, తానియా స‌చ్ దేవ్, చెస్‌లో ద్రోణ‌వ‌ల్లి హారిక అంద‌మైన క్రీడాకారిణులుగా పేరొందారు.
ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న కంపెనీలన్నీ వీరితో ప్ర‌క‌ట‌న‌లు త‌యారు చేస్తూ..వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ఒక‌ప్పుడు ఆట‌లు..క్రీడ‌లు అన్న‌వి ఆ దేశ‌పు ఔన్న‌త్యాన్ని నిల‌బెట్టేవిగా ఉండేవి. ఇపుడు ఆ సీన్ మారింది. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్‌గా త‌యార‌య్యాయి. స్పాన్స‌ర‌ర్స్ బ‌డా కంపెనీలుగా ఉండ‌డంతో వారు చెప్పిన‌ట్లే ఆయా క్రీడా సంఘాలు త‌లూపుతున్నాయి. కాసులు వ‌స్తున్నాయి క‌దా అని మ‌న క్రీడా ముద్దుగుమ్మ‌లు కోట్లు వెన‌కేసుకుంటున్నారు.
అందం విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా త‌మ ఆట‌తీరుతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎన్ని విజ‌యాలు సాధిస్తే అంత‌గా కంపెనీలు వ‌చ్చి వాలిపోతాయి. ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తాయి. బ్రాండ్ వాల్యూ పెంచుకునేందుకు ప్లేయ‌ర్లు తంటాలు ప‌డుతుంటే వీరి అందంతో మాత్రం వ్యాపారం చేయ‌డంలో బ‌డా కంపెనీలు స‌క్సెస్ అయ్యాయి. మొత్తం మీద కంపెనీలు..ప్లేయ‌ర్లు..స్పాన్స‌ర‌ర్ల పుణ్య‌మా అంటూ క్రీడ‌లు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. కాసులు కురిపించేలా చేస్తున్నాయి. ఆట‌కు అందం వ‌న్నె తెస్తోందన్న‌ది వాస్త‌వం..ఫ్యాన్స్‌కు మాత్రం ఎటు చూసినా పండ‌గే.

కామెంట్‌లు