ఎడ్యూకేషన్ సెక్టార్లో ఎడ్‌సెన్స్ హవా
హైద్రాబాద్ కేంద్రంగా ఎడ్యూకేషన్ స్టార్టప్‌లలో ఎడ్ సెన్స్ దూసుకెళుతోంది. స్టార్టప్ నుండి కంపెనీగా ఎదిగింది. ఆయిల్, గోల్డ్, డైమండ్స్, లిక్కర్‌తో పాటు విద్యా రంగం వ్యాపార రంగాలుగా మారాయి. వీటన్నింటి కంటే విద్య కోట్లు కురిపిస్తోంది. కోచింగ్ సెంటర్లు, కాలేజీలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. వీటిపై ఆధారపడిన పెన్నులు, కాగితపు పరిశ్రమలు ఆదాయ బాట పట్టాయి. ఎడ్యుకేషన్ పరంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు ఫ్లాట్‌ఫామ్స్ మారుతున్నాయి.
ఐటీ సెక్టార్ పరంగా హైదరాబాద్ కేంద్రంగా ఉండడం, గూగుల్, ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టా గ్రాం, లాంటి కంపెనీలతో పాటు లాజిస్టిక్ రంగాలలో ప్రముఖంగా ఉన్న కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్ డీల్ లాంటి కంపెనీలు దీనిపైనే కాన్ సెంట్రేషన్ చేస్తున్నాయి. విద్యార్థులకు భట్టీ పట్టే చదువులు కాకుండా టెక్నాలజీ బేస్ చేసుకుని భారం తప్పించి..విజ్ఞానాన్ని పంచేలా టెక్నాలజీ జోడించాలన్నదే ఎడ్ సెన్స్ స్టార్టప్ ఆశయం.
కిరణ్, సునీల్ సత్యవోలు, పోతుల విజయ్, వివేక్ లు కలిసి ఎడ్ సెన్స్ ను ఏర్పాటు చేశారు ఆరు నెలల కిందట. వీరు దీనిని కంపెనీగా మార్చేందుకు పడని కష్టమంటూ లేదు. రేయింబవళ్లు శ్రమించారు. నగరమంతా తిరిగారు. స్కూళ్లు, కాలేజీలు తిరిగారు. కోచింగ్ సెంటర్లను సందర్శించారు. విద్యార్థులకు..సంస్థలకు మధ్య ఎలాంటి వాతావరణం ఉండాలి. ఏయే సౌకర్యాలు కల్పించాలి. ఎలాంటి ఫార్మాట్‌లను వాడాలి. మార్కెట్లో దొరికే పుస్తకాలలో నిజమైన కంటెంట్ ఉన్నదా. కాలేజీలు పిల్లలతో ఎలా వ్యవహరిస్తున్నాయి.
సబ్జెక్టుల్లో అధ్యాపకులు, లెక్చరర్స్, ప్రొఫెసర్లు పరిణతి సాధించారా. ఎలాంటి ఫార్మాట్‌లను ఉపయోగిస్తూ పాఠాలు బోధిస్తున్నారు..? ఇలాంటి వన్నీ పరిగణలోకి తీసుకుని ఎడ్ సెన్స్‌ను స్టార్టప్‌గా మలిచారు. సరిత కేశమోని సీడ్ ఫండ్ సమకూర్చేందుకు ముందుకు వచ్చారు.
అకడమిక్ ఎక్సలెన్స్, సైకాలజీ ని టెక్నొలాజికల్ మీడియం ద్వారా అనుసంధానించడం దీని ముఖ్య ఉద్ధేశం. విద్యావేత్తలను, వ్యాపారవేత్తలను, సీడ్ ఫండింగ్ సపోర్ట్ చేసే వాళ్లను ఎడ్ సెన్స్ టీం సభ్యులు కలిశారు. టెక్నాలజీ వాడకం వల్ల టైం కలిసి వస్తుందని వివరించారు. సేల్స్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది ఈ కంపెనీ. ఆపరేషన్స్ టీం, అడ్వయిజర్స్, మెంటార్స్‌తో కస్టమర్లతో అనుసంధానం చేస్తున్నారు. ఎడ్ టెక్ సొల్యూషన్ పేరుతో ఎడ్ సెన్స్ పనిచేస్తోంది. టీచర్లలో ప్రతిభను పెంచడం, వృత్తి పరంగా పరిణతి సాధించడం, విద్యార్థులు చదువులో టాపర్స్‌గా నిలిచేలా, లెర్నింగ్ సిస్టంలో పారదర్శకత ఉండేలా చేయడం.
అభిరుచులు, బలాలు, బలహీనతలు గుర్తించడం. నైపుణ్యం, ప్రవర్తన, ఆరోగ్యం, పౌష్టికాహారం, చదువుకునేలా చేయడం, తల్లిదండ్రులు, అధ్యాపకుల మధ్య అర్థం చేసుకునే వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఎడ్ సెన్స్ చేస్తుంది. ఒక్కో విద్యార్థి మరింత బలపడేలా..చదువులో రాణించేలా ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పదును పెడుతోంది.
బి2సీ సప్లిమెంటరీ లెర్నింగ్ మెథడ్స్, స్టూడెంట్ బేస్ రికార్డులు మెయింటెనెన్స్ నిర్వహించడం ..చైల్డ్ ఫ్రిఫెరెన్స్‌స్..సైకాలజీ, టెక్నాలజీకి జోడించి మెరుగైన ఫలితాలను తీసుకు రావడమే ఎడ్ సెన్స్ లక్ష్యం. ఆ దిశగా ఏర్పాటు చేసిన ఈ స్టార్టప్ కంపెనీగా ఎదిగి హైదరాబాద్ ఎడ్యూకేషన్ రంగంలో కొత్త మార్పును తీసుకు వస్తోంది. విద్యకు టెక్నాలజీ జోడించడం ..విద్యార్థుల్లో బరువు తగ్గించడం..అద్భుత ఫలితాలు అందుకునేలా చేస్తూ ఎడ్ సెన్స్ దూసుకు పోతోంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో సీబీఎస్ ఇ సిలబస్‌తో నడుస్తున్న స్కూల్స్‌ను టార్గెట్ చేసిందీ కంపెనీ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి