మహిళలు..మహరాణులు ..!
చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించక పోయినా ...ఆకాశంలోనే కాదు అన్నింటా తామే అంటున్నారు మహిళలు. ప్రపంచీకరణ పుణ్యమా అంటూ అపారమైన విద్యా, ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడింది. దీంతో దేశం నలుమూలల నుండి పలు దేశాలకు వెళ్లారు. ఆయా ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యావేత్తలుగా, వ్యాపార వేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, కార్పొరేట్ కంపెనీల సీఇఓలుగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా, జనరల్ మేనేజర్లుగా, హెచ్ ఆర్‌లుగా, ఐటీ ప్రొఫెషనల్స్‌గా , స్పోర్ట్స్ పర్సన్స్‌గా ..అనలిస్టులుగా, ఉన్నతాధికారులుగా, సివిల్ సర్వెంట్స్‌గా , పొలిటికల్ లీడర్లుగా , ముఖ్యమంత్రులుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాక ఆంట్రప్రెన్యూర్స్‌గా రాణిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖుల నుంచి స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఎందరికో ఉపాధినిస్తున్న వీఎల్‌సీసీ - వందనా లుథ్హారా మహిళగా ఎన్నో విజయాలు అందుకున్నారు. అందమే ఆనందమే కాదు అదో భరోసాను కల్పిస్తుందనే నమ్మకంతో వీఎల్‌సీసీ పేరుతో బ్యూటీ పార్లర్స్‌ను ఏర్పాటు చేశారు. హెల్త్ కేర్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారు. ఈ కంపెనీ కింద దాదాపు 6 వేల మందికి పైగా ప్రొఫెషన్సల్‌గా తీర్చిదిద్ది ఉపాధి కల్పించిన ఘనత వందనది. ఆమె చేసిన కృషిని గుర్తించిన ప్రభుత్వం 2013లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆసియా, గల్ఫ్ కంట్రీస్‌లో వీఎల్‌సీసీ విస్తరించేలా చేసింది. 2015లో ఫోర్ట్ ప్రకటించిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో వందన చోటు దక్కించుకున్నారు. మొరార్జీ దేశాయి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా మెంబర్‌గా ఉన్నారు.
సుచీ ముఖర్జీ ..వెరీ స్పెషల్ - మనమీద మనకున్న నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది అంటోది సుచీ ముఖర్జీ. సుచి పేరుతో చిన్నగా స్టార్ట్ చేసిన ప్రొడక్ట్స్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేలా చేసింది. లక్షలతో ప్రారంభించిన ఈ వ్యాపారం కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. దీని వెనుక అకుంఠితమైన శ్రమ ఉన్నది. లైమ్ రోడ్ పేరుతో కంపెనీని స్టార్ట్ చేశారు. 2012 నుండి నేటి దాకా ఆమె బిజినెస్ అంచెలంచెలుగా అభివృద్ధి వైపు దూసుకు పోతోంది. 200 మంది ఐఐటీయన్స్ ఈమెకు సపోర్ట్‌గా నిలిచారు. వయసు రీత్యా 45 ఏళ్లున్నా ఎప్పటికప్పుడు వ్యాపార మెళకువలను మెరుగు పర్చుకుంటూ ..అప్‌డేట్ చేసుకుంటూ దూసుకెళుతోంది. లైమ్‌రోడ్ కంపెనీలో పనిచేస్తున్న వారంతా సుచీ ముఖర్జీకి కృతజ్ఞత చెబుతున్నారు.
మహిళలకు ఆలంబన..రిచాకార్ - నీవు బలంగా తయారైతే దేనినైనా సాధించవచ్చు అంటారు ముప్పై ఏళ్ల రిచాకార్. నర్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ లో అభ్యసించారు. సాప్‌లో అపార అనుభవం గడించారు. ఆన్ లైన్‌లో వ్యాపారాన్ని ప్రారంభించారు. నేరుగా మహిళలకు కావాల్సిన లో దుస్తులను పరిశ్రమలు అందించే ధరలకే విక్రయిస్తున్నారు. జివామే పేరుతో స్టార్ట్ చేసిన కంపెనీకి ఊహించని రీతిలో ఆదరణ లభించింది. ప్రతిష్టాత్మకంగా భావించే బిట్స్ పిలానీలో చదివారు. ఐటీ ప్రొఫెషనల్‌గా పని చేస్తూనే డిఫరెంట్ గా ఆలోచించారు. లేడీస్ లోదుస్తులపైనే దృష్టి పెట్టారు. మొత్తం మీద సక్సెస్ సాధించారు. వ్యాపారవేత్తగా ఎదిగారు.
ఫాల్గుణీ నాయర్ - బ్యాంకు నుండి బ్యూటీ దాకా - దేశంలోని ప్రధాన బ్యాంకుల్లో ఒకటిగా పేరొందిన కొటక్ మహీంద్ర బ్యాంకును లాభాల బాట పట్టించిన చరిత్ర ఫాల్గుణి నాయర్‌ది. వయసు రీత్యా 50 ఏళ్లు దాటినా ఇంకా యువకులకు తీసిపోని విధంగా శ్రమిస్తున్నారు. అంతకు ముందు టెమ్‌సెక్‌తో పాటు కొటక్‌ను ట్రాక్‌లో పెట్టారు. విద్యాపరంగా ఐఐఎంఏలో పట్టా పొందిన ఆమెకు వ్యాపార, వాణిజ్య రంగాలపై అపారమైన పట్టు సంపాదించారు. ఎంతో అనుభవం గడించిన ఆమె బ్యూటీ రంగంపై దృష్టి పెట్టారు. నయకా పేరుతో బ్యూటీ పరిశ్రమను స్టార్ట్ చేశారు. 35 వేల వస్తువులు, 650 బ్రాండ్స్ తో విరాజిల్లుతోంది ఆమె కంపెనీ. వేలాది మంది దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. రోజుకు 15 వేల ఆర్డర్స్ లభిస్తుండడం సక్సెస్‌కు నిదర్శనం.
సక్సెస్‌కు మారు పేరు వాణికోలా - దేశ వ్యాప్తంగా బెస్ట్ ఆంట్రప్రెన్యూర్‌గా వాణి కోలాకు పేరుంది. సృహుద్భావ వాతావరణం వుంటే ఎంతటి క్లిష్టతరమైన పనినైనా ఈజీగా చేయవచ్చంటూ నిరూపిస్తున్నారు ఆమె. కలారీ కేపిటల్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారు. అరిజోనా స్టేట్ యూనివర్శిటీలో పట్టా పొందిన ఆమె మంచి అనుభవాన్ని స్వంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ బిజినెస్ వుమెన్ గా ప్రశంసలు అందుకున్నారు. 51 ఏళ్లు గడిచినా ఇంకా నూతనోత్తేజంతో దూసుకు వెళుతున్నారు. సెర్టస్ సాఫ్ట్ వేర్ కంపెనీతో పాటు రైట్ వర్క్స్ కంపెనీల్లో మేనేజరల్ స్థాయిలో పని చేశారు. పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. మచ్చుకు కొన్ని పేరొందిన కంపెనీలు ఉన్నాయి. స్నాప్ డీల్, మైంత్ర, వయా, యాపస్ డెయిలీ, అర్బన్ లాడర్, జివామే, పవర్ 2 ఎస్ ఎంఇ, బ్లూ స్టోన్ కంపెనీల్లో వాణి కోలా ఇన్వెస్ట్ చేశారు. యుఎస్‌లో 22 ఏళ్ల పాటు ఉన్నారు. మదర్ ఆప్ వెంచర్ కేపిటలిజం ఇండియా గా ఆమె పేరు గడించారు.
ప్రాన్షు భండారీ - సక్సెస్‌కు మారు పేరు ఆమె. స్పష్టమైన ప్రణాళిక. టైమ్ సెన్స్ కలిగి ఉండటం..కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమేనంటారు ఫ్రాన్షు భండారీ. కల్చర్ అల్లే పేరుతో కంపెనీని ప్రారంభించారు. దీని ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. కేవలం 26 ఏళ్ల వయస్సున్న భండారీ ఏది పట్టుకున్నా సక్సెసే. నర్సీ మోంజీ ఇనిస్టిట్యూట్‌లో మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పట్టా పొందారు. అంతకు ముందు విప్రోలో పని చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ అప్లికేషన్ పేరుతో ప్రత్యేకంగా యాప్ తయారు చేశారు. ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాం ద్వారా పని చేస్తుంది. ఎలాంటి ప్రాథమిక అవగాహన లేక పోయినా సరే ఈ యాప్ ద్వారా ఇంగ్లీష్ పై పట్టు సాధించవచ్చు. ఆరు మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం విశేషం. ఈ యాప్ కోట్లాదిపతిని చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అయిదు ప్రతిష్టాత్మకమైన అవార్డులను స్వంతం చేసుకున్నారు భండారీ.
మన కథే విజేత - శ్రద్ధా శర్మ ఈ పేరు ఇండియాలోనే కాదు వరల్డ్ లో ఫేమస్. బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుగా ఆమె ఫేమస్. ప్రతి ఒక్కరికి ఓ కథ వుంటుంది. వారి కథలను స్ఫూర్తి దాయకంగా మలిస్తే..వాటిని ప్రత్యేక కథనాలుగా ప్రపంచానికి పరిచయం చేస్తే ..ఇలాంటి ఆలోచనే ఆమెను యువర్ స్టోరీని స్థాపించేలా చేసింది. బెంగళూరు కేంద్రంగా ఆమె ప్రారంభించిన యువర్ స్టోరీలో టాటా లాంటి దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. పలు భాషల్లో ఎలాంటి పైసా లేకుండా నిజాయితీగా వ్యాపార రీత్యా విజయం సాధించిన వారి గురించి స్టోరీలు పొందు పరిచారు. కొద్దిపాటి పెట్టుబడితో ప్రారంభమైన ఈ పోర్టల్ ఇపుడు ఏది కావాలన్నా గూగుల్‌లో ఆమెను వెదుకుతున్నారు. యువర్ స్టోరీ ఇపుడు పోర్టల్ కాదు వేలాది మందికి ఉపాధినిస్తోంది. క్రియేటివిటీ కలిగిన వారికి ఓ ఫ్లాట్ ఫాంగా ఏర్పడింది. థ్యాంక్యూ శ్రద్ధా శర్మ. మెంటార్‌గా, జర్నలిస్టుగా, బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుగా, మీడియా ఎక్స్ పర్ట్‌గా, ఎడిటర్‌గా, ఫౌండర్ గా ఇలా ఎన్నో రంగాల్లో అనుభవం గడించిన ఆమె సాధించిన విజయం ఎందరో మహిళలకు స్ఫూర్తి కావాలి.
ఆహారమే ఆదాయం - ఉపాసనా టాకూ. వ్యాపారమంటే డబ్బులు కాదు..ఓ రకంగా సమాజానికి సేవలు అందించడం. ప్రజలతో మెలగడం అంటారు ఉపాసనా టాకూ. స్వస్థలం కాశ్మీర్ ప్రాంతమైనా..గుజరాత్‌ను కేంద్రంగా ఎంచుకున్నారు. ప్రతిష్టాత్మకమైన స్టాన్‌ఫోర్ట్ యూనివర్శిటీలో చదివారు. ప్రతిష్టాత్మకమైన పేపల్, జాక్‌పే, 2020 సోషల్ కంపెనీల్లో పని చేశారు. మొబిక్విక్ పేరుతో కేవలం అయిదు మందితో కంపెనీని స్టార్ట్ చేశారు. రోజూవారీగా నాణ్యమైన ఆహారాన్ని జనానికి అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఆమెను విజయవంతమైన వ్యాపార వేత్తగా చేసింది. జస్ట్ కొద్ది మందితో స్టార్ట్ చేసిన ఈ వ్యాపారం కోట్లను కుమ్మరిస్తోంది. ఇదంతా ఆమె సాధించిన విజయం కాదంటారా.
ఇలాంటి కోవలోకే ఆండ్రా కన్నన్ అంబిలి, సాంచి పోవయా, రంజనా నాయర్ వస్తారు. రే ఐఓటి సొల్యూషన్స్ ఇంక్ పేరుతో కంపెనీని ప్రారంభించారు. వీరంతా అంతకు ముందు యాత్రా, హాక్స్, విప్రో, మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేశారు. రేబేబీ పేరుతో వీరందించిన సేవలకు ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. పిల్లలకు కావాల్సిన ప్రొడక్ట్స్ అందించడంలో పేరొందిన కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వీరి సేవలను వినియోగించుకుంటోంది. పిల్లలకు ఏం కావాలో వీరు రీసెర్చ్ చేస్తారు. ఇన్‌పుట్స్ అంతా వీరందిస్తారు. చిన్నపాటి ఆలోచన కోట్లు వచ్చేలా చేస్తోంది.
వరల్డ్ మోస్ట్ బ్యూటీషియన్ ..షహనాజ్ హుస్సేన్ - కోట్లాది రూపాయలు..లెక్కలేనన్ని ఆస్తులు. చిటికేస్తే చాలు వాలే వాహనాలు..మనుషులు..లోకమంతటా బ్యూటీ పార్లర్లు..ప్రొడక్ట్స్..ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాది పడుతుంది. అంతలా ఎదిగారు షహనాజ్. మీరు పుట్టుకతో అందగా ఉండక పోవచ్చు. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మా వస్తువులు వాడితే మాత్రం అందం మీ స్వంతమవుతుంది అంటారు. ఆమె చేసిన ఈ ప్రయత్నం తక్కువ సమయంలోనే బిలియనీర్స్ జాబితాలో చేర్చేలా చేసింది. సక్సెస్ అంటే నోట్లు కాదు..నమ్మకం అంటారు ఆమె. కాదనలేం. ఒప్పుకోకుండా ఉండలేం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి