ఓవర్సీస్‌లో ప్రిన్స్ అరుదైన రికార్డు - వసూళ్లలో టాప్
తెలుగు సినిమా పరిశ్రమలో నటుడు మహేష్ బాబుకు ఓ ప్రత్యేకత వుంది. చాలా సింపుల్ గా తన కుటుంబం..వృత్తి మిగతావేవీ పట్టించుకోరాయన. ఏ సినిమా చేసినా కథలో కొంచెం కొత్తదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు ..అన్ని వర్గాలకు చెందిన వారంతా ఆయనకు అభిమానులు. మోస్ట్ వాంటెడ్..మోర్ పాపులర్ హీరోగా ఇప్పటికీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. మొన్న శ్రీమంతుడు..నిన్న భరత్ అనే నేను సినిమాలతో ఓ రేంజ్‌లో ఇటు టాలీవుడ్‌లోను..అటు ఓవర్సీస్‌లోను వసూళ్లలో రికార్డులు తిరగరాస్తున్నారు. మహేష్ బాబు అంటేనే ఓ స్పెషాలిటీ..ఆయనకు అన్ని ప్రాంతాలలో నటించే నటీమణులే కాదు యూత్ కూడా ఫిదా. 20 కోట్ల రూపాయల రేంజ్ నుండి ఏకంగా 110 కోట్లకు పైగా వసూలు చేసే స్థాయికి చేరుకున్నాయి తెలుగు సినిమాలు. ఎన్నడూ లేనంతగా సినిమా ప్రేక్షకులు మాత్రం కంటెంట్ ..ఎంటర్ టైన్‌మెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమాల నిర్మాణం నుంచి విడుదలయ్యే దాకా ప్రతిదీ ఓ యుద్ధాన్ని తలపింప చేస్తోంది. సినిమా నడుస్తుందా లేదో అనే విషయాన్ని ట్రైలర్ లోనే చెప్పేస్తున్నారు. దీంతో ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటున్నారు మూవీ ప్రొడ్యూసర్స్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, పంజాబీ మూవీస్‌కు విదేశాలలో ఎక్కడలేని డిమాండ్ ఉంటోంది. నిర్మాతలు మొదటగా ఓవర్సీస్‌లో సక్సెస్ టాక్ తెచ్చుకునేలా చేస్తున్నారు. అందరినీ ఆకట్టుకునేలా..అలరించేలా చేసేందుకు డైరెక్టర్లు శ్రమిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, రణ్‌బీర్ సింగ్, రణదీప్ హూడాతో పాటు విశాల్, రజనీకాంత్, విజయ్ , కమల్ హాసన్ తదితర నటులతో పాటు తెలుగు సినిమా వరకు స్టార్ హీరోస్ తమ హవాను కొనసాగిస్తున్నారు.
న్యూ ట్రెండ్స్ సృష్టించేందుకు వెనుకాడటం లేదు. హీరోల రెమ్యూనరేషన్ కోట్లల్లో ఉంటోంది. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో థియేటర్ల వారీగా డిస్ట్రిబ్యూటర్లు చీలి పోయారు. తెలంగాణలో సినిమాలు విడుదల కావాలంటే రెండు మూడు నెలల ముందే బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నిర్మాణం, దర్శకత్వం ఒక ఎత్తయితే..రిలీజ్ అన్నది తలకు మించిన భారంగా మారింది. ఇటీవల కొంచెం ట్రెండ్ మారింది. మేజర్ హీరోల కంటే ఎక్కువగా చిన్న హీరోలు, చిన్న బడ్జెట్ కలిగిన మూవీస్ అనుకోని రీతిలో సక్సెస్ సాధించాయి. బిగ్ హీరోస్ మూవీస్‌కు షాక్ ఇచ్చాయి. రాకెట్‌లా దూసుకు వచ్చిన విజయ దేవరకొండ నటించిన సినిమాలు భారీ విజయాలు నమోదు చేసుకున్నాయి. గాయనీ గాయకులు, సంగీత దర్శకులు..సినీ డైరెక్టర్లు , రచయితలు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. సక్సెస్‌లో భాగం పంచుకుంటున్నారు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఇండియా పరంగా ఎవరికి వారే హీరోలు అయితే ..ఓవర్సీస్‌లో మాత్రం మన మహేష్ బాబే నెంబర్ వన్ గా నిలవడం ఓ సంచలనం. ఇపుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏమిటంటే సినిమాల వసూళ్లలలో తమిళ తలైవా సినిమాల కంటే ముందంజలో నిలిచాడు.
రజనీకాంత్ కు కూడా సాధ్యం కాని అరుదైన ఫీట్ ను మనోడు సాధించాడు. ఓవర్సీస్‌లో అత్యధిక ఒక మిలియన్ డాలర్ సినిమాలు కలిగిన హీరోల్లో ప్రథమ స్థానాన్ని మహేశ్ సొంతం చేసుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలు అమెరికాలో ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకున్న సినిమాలు కూడా ఈ జాబితాలో ఉండటం.. ఓవర్సీస్‌లో మహేశ్ క్రేజ్‌ను చెప్పకనే చెబుతున్నాయి. టాలీవుడ్‌లోనే కాదు.. దక్షిణ భారతదేశంలోని ఏ హీరోకు ఈ రికార్డు దక్కలేదు. మహేశ్ తర్వాత ఆ స్థానాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ దక్కించుకున్నారు. ఆయన నటించిన ఏడు సినిమాలు ఓవర్సీస్‌లో ఒక మిలియన్ డాలర్ కలెక్షన్లను రాబట్టగలిగాయి. మహేశ్‌లాగానే రజనీ విషయంలో కూడా ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఓవర్సీస్‌లో ప్రవాసులు మాస్ సినిమాలను పెద్దగా చూడరు.
ఫ్యామిలీ, థ్రిల్లర్, ప్రయోగాత్మక చిత్రాలకు వారు పెద్దపీట వేస్తుంటారు. మహేశ్, రజనీ ఈ కోవలోనే సినిమాలు తీస్తుండటంతో ఈ రికార్డు సాధ్యమయిందని చెప్పవచ్చు. అంతేకాక ఓవర్సీస్‌లో వీరిద్దరి సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. మహిళా అభిమానులు కూడా వీరిద్దరికీ ఎక్కువే. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేనొక్కడినే, ఆగడు, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను సినిమాలు భారీ కలక్షన్లు రాబట్టాయి. నేనొక్కడినే, ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలకు ఇక్కడ నెగటివ్ టాక్ వచ్చింది..అయితే ఓవర్సీస్‌లో మాత్రం పాజిటివ్ గానే వసూళ్లు రావడం విశేషం. మరో వైపు రజనీకాంత్ నటించిన సినిమాలు శివాజీ, రోబో, లింగా, కబాలి, కాలా, రోబో -2, పేట సినిమాలు ఒక మిలియన్ డాలర్లను వసూలు చేశాయి ఓవర్సీస్‌లో.. అయితే శివాజీ, లింగా, కబాలి, కాలా సినిమాలకు నెగటివ్ టాక్ వచ్చింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి