భాగ్యనగరానికే బ్రాండ్ జిందా తిలిస్మాత్ .. ఏటా 12 కోట్ల టర్నోవర్ ..! -పేదలకు వరం దివ్య ఔషధం
ఏ ఊరుకు వెళ్లినా..ఏ ఇంటి తలుపు తట్టినా..ఏ సంతలో తచ్చట్లాడినా..ఏ జాతరను సందర్శించినా ..అందుబాటులో ఉండే దివ్యమైన ఔషధం జిందా తిలిస్మాత్. తెలంగాణ ప్రాంతానికి అరుదైన గౌరవంగా నిలుస్తోంది. తరతరాలుగా చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి అంగట్లో ..మందుల దుకాణంలో..కిరాణా కొట్టులో..పాన్ షాప్‌ల వద్ద ..ప్రతి చోటా తిలిస్మాత్ లభిస్తుంది. ఇంతగా ప్రాచుర్యం పొందిన ఈ మందు ధర చాలా తక్కువ. జలుబు..దగ్గుకు ఇది అద్భుతంగా పని చేస్తుంది. అందుకే దీనికంతటి డిమాండ్. కార్పొరేట్ మందుల కంపెనీలు సాధించలేని సక్సెస్ ను ఈ మందు స్వంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోని ప్రతి నగరంలో జిందా తిలిస్మాత్ విరివిగా లభిస్తుంది. ఏ బిజినెస్ మేగ్నట్ సాధించలేని ఫీట్‌ను ఫారూఖీ కుటుంబం సాధించింది. దీనిపై బడా కంపెనీలు కన్నేసినా ఆ దరిదాపుల్లోకి వెళ్లలేక పోయాయి. దీని ఫార్మూలా వారికి మాత్రమే తెలుసు. అంతగా కొన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఐటీ అనే సరికల్లా హైదరాబాద్ ను చూపిస్తున్నారు. కానీ భారతదేశ చరిత్రలో..యునాని పరంగా జిందా తిలిస్మాత్ తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతటి మహత్తు ఈ మందులో ఉంది. ఇది ఇండియాలో ఒక్క హైదరాబాద్‌లోనే తయారవుతుంది. ఇంకెక్కడా దీనికి బ్రాంచీలు లేవు. లక్షలాది కుటుంబాల్లో ..ముఖ్యంగా పేదవారి ఇళ్లల్లో ..గుడిసెల్లో ఉన్న వారి దగ్గర ఇది తప్పక దొరుకుతుంది. ఇంతగా పాపులర్ అయిన ఈ మందు గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇది తక్షణ ఉపశమనం కలిగించడంతో పాటు సర్వరోగ నివారిణిగా పనిచేస్తుండడం దీని ప్రత్యేకత. జలుబు, తలనొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు ఇలా అన్నంటికి తాత్కాలికంగా సేద దీరేలా చేస్తుంది. ఈ మందు ఫార్మూలాను కనిపెట్టింది ఔరంగాబాద్ నుండి హైదరాబాద్‌కు వలస వచ్చిన హకీం మహ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ. దాదాపు వందేళ్ల నుండి ప్రచారంలో ఉంది. ఈ ఔషధం పల్లెటూర్లలోని పచారీ కొట్టు మొదలుకొని నగరంలోని అన్ని డిపార్ట్‌మెంటల్ స్టోర్ల వరకు ఎక్కడైనా లభిస్తుంది. దేశీయ వైద్య విధానానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు ఇదో ఉదాహరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఫారూఖీ యునానీ కోర్సు పూర్తి చేశారు. చికాగో మెడికల్ కాలేజీ ఆఫ్ హోమియోపతి నుంచి హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సు చేశాడు. ఫారూఖీకి ముందు నుండి పరిశోధనలు చేయడం అంటే చచ్చేంత ఇష్టం. హైదరాబాద్ మోతీ మార్కెట్‌లోని ఆయన ఇంట్లోనే ఆస్పత్రిని ప్రారంభించాడు. ఒకవైపు పేదలకు వైద్యం చేస్తూనే మరో వైపు ఔషధాన్ని తయారు చేసేందుకు ప్రయత్నం చేశాడు. మందు కనిపెట్టడం ఒక ఎత్తయితే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసు కోవడం మరో ఎత్తు. ఫలితాలను అంచనా వేసి..మందు తయారీలో మార్పులు చేర్పులు చేసి సక్సెస్ ఫుల్‌గా అయ్యేలా చేశాడు ఫారూఖీ. మొత్తం మీద జిందా తిలిస్మాత్ ఫార్మూలాను కనిపెట్టి చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు ఫారూఖీ పళ్లపొడి ఫార్మూలాకు ప్రాణం పోశాడు.
అప్పట్లో ఇపుడున్న వసతి, రవాణా సౌకర్యాలు లేవు. ఏ వస్తువు తయారు చేసినా..దానిని అమ్ముకోవాలంటే నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. పగలంతా వైద్యం చేసి ..చీకటి పడగానే మొయిజుద్దీన్ ఫారూఖీ ఏదో ఒక గ్రామానికి వెళ్లేవాడు. ఈ మందు వాడి చూడండి..మీ ఇంటిల్లిపాదికి సర్వరోగ నివారిణి లాగా పనిచేస్తుదంటూ ఇంటింటా ప్రచారం చేశాడు. ఆయా పల్లెల్లోని గోడలపై తానే ప్రకటనలు రాసేవాడు. ప్రయాణం చేసేటప్పుడు పక్కనున్న వారికి ఉచితంగా జిందా తిలిస్మాత్ ఇచ్చేవాడు. గాలిపటాలపై కూడా రాయించాడు. ఫారూఖీ శ్రమ ఫలించింది. ప్రతి ఇంట్లోను జిందా తిలిస్మాత్ ఒక భాగమై పోయింది. ఈ మందుతో పాటు ఫారూఖీ పళ్లపొడి మందులకు తయారీ దారు..ప్రకటనకర్త..అమ్మకందారు..కార్మికుడు..యజమాని అన్నీ మొయిజుద్దీన్ ఫారూఖీనే.
అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ రెండు విశ్వాసాన్ని చూరగొన్నాయి. ఒక బ్రాండ్‌గా మారిపోయింది. తెలంగాణ, ఏపీలతో పాటు ఇండియా అంతటా విస్తరించింది. ఇతర దేశాలలో దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. జిందా తిలిస్మాత్ ఔషధంగా మారడంతో ..దీని పేరుతోనే పెద్ద కంపెనీగా అవతరించింది. మహ్మద్ మొయుజుద్దీన్ ఫారూఖీ తనయుడు మహ్మద్ ఓవైసుద్దీన్ ఫారూఖీ దీనిని విజయవంతంగా నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ 12 కోట్ల రూపాయలకు పైగా ఉంది. దీని ఉత్పత్తులు తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, యుఎస్, సౌదీ, దుబాయి, అబుదాబిలో విక్రయిస్తున్నారు. ఈ కంపెనీలో ఎలాంటి యంత్రాలను వాడడం లేదు. ఇన్నేళ్లు గడిచినా ఇదే దీని ప్రత్యేకత. ప్రస్తుతం దీని తయారీలో 85 మంది పాలుపంచుకుంటున్నారు.
జిందా తిలిస్మాత్ బాటిల్‌పై ఆఫ్రికన్ నీగ్రో బొమ్మ లోగో ఉంటుంది. అది చూసి అప్పట్లో ఎవరో ఆఫ్రికన్ ఫారూఖీకి ఈ ఫార్మూలా చెప్పి ఉంటారనే ప్రచారం జరిగింది. కానీ ఈ బొమ్మ పెట్టడం వెనుక ఓ కారణం ఉంది. అప్పట్లో నిజాం ఆర్మీలో ఆఫ్రికన్లు ఉండేవారు. వాళ్లు చాలా ఆరోగ్యంగా..ధృడంగా ఉండడంతో..అప్పట్లో ప్రారంభించడంతో వారి బొమ్మనే పెట్టి ముద్రిస్తే సులువుగా అర్థమవుతుందని దీనినే ఉంచారు. అదే ఆనవాయితీగా వస్తోంది. ఎన్ని కోట్లు వ్యాపారం జరిగినా..ఈ కంపెనీ తన విలువలను కోల్పోలేదు. యాజమాన్యం పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో జిందా తిలిస్మాత్, ఫారూఖీ పళ్ల పొడిని ఉచితంగా పంపిణీ చేస్తారు. ఏటా హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా అందజేస్తారు. సర్వరోగ నివారణిగా వినుతికెక్కిన ఈ దివ్య ఔషధం..భాగ్యనగరానికే తలమానికంగా నిలిచింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి