నిరాడంబర నేతకు నీరాజనం - సారంగి స్మరామి..!
..సర్కార్‌ను..ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోదీని జాతి యావత్తు ప్రశంసలతో ముంచెత్తుతోంది. ఎందుకంటే ..ఒక సామాన్యమైన కుటుంబానికి చెందిన వ్యక్తి, సామాజిక కార్యకర్తగా , స్వంత ఆస్తి అంటూ లేని నిరాడంబరుడైన వ్యక్తి..ప్రతాప్ సారంగికి కేబినెట్‌లోకి తీసుకోవడం. ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అసాధారణమైన నిర్ణయం ఇది. గ్రామ సర్పంచ్ పదవి కోసం తెలంగాణలో 50 లక్షల దాకా ఖర్చు చేస్తే..ఈ ఎంపీ మాత్రం ఒక్క పైసా ఖర్చు చేయకుండానే ఎన్నికల్లో ప్రచారం చేశారు. తనకంటూ ఏదీ దాచు కోలేదు. సమాజమే దేవాలయం..ప్రజలే దేవేళ్లు అనే దానికి సారంగి కట్టుబడ్డారు.
నమ్మిన విలువల కోసం తన ప్రస్థానాన్ని సాగించారు. ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. ఏకంగా ఎలాంటి వాహనం లేకుండానే..కేవలం ఆటోలో కేంద్ర కేబినెట్‌లో దక్కించుకున్న సారంగి సాధారణ వ్యక్తిగా దిగారు. పోలీసులు ఆయనను గుర్తించలేదు. కానీ మోదీ ఎదురేగి తీసుకు వచ్చారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన 8 వేల మందికి పైగా లేచి నిలబడి ఆయనకు చప్పట్లతో స్వాగతం పలికారు. సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ..జీవితమంతా సమాజ హితం కోసం పనిచేసిన సారంగి ఇపుడు మోదీ తర్వాత అంతటి పాపులర్ నాయకుడిగా పేరొందారు. గూగుల్ దిగ్గజంలో సారంగి గురించి ఎక్కువగా వెతికారంటే ఆయన గురించి అర్థం చేసుకోవచ్చు.
ఆయన ఎంతటి పాపులర్ అయ్యారో. ఒక్కసారి ఎమ్మెల్యే ,ఎంపీ అయితే కోట్లు వెనకేసుకునే ప్రబుద్దులున్న ఈ తరుణంలో ఇలాంటి సాధారణ వ్యక్తి ఎంపీగా కావడం విస్మయానికి గురి చేసింది. సారంగి పూర్తి పేరు ప్రతాప్ చంద్ర సారంగి. 4 జనవరి 1955లో జన్మించారు. మోదీ కేబినెట్‌లో తెలంగాణలో ఎంపీగా గెలిచిన గంగాపురం కిషన్ రెడ్డి గెలుపొందారు. ఆయనకు హొం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఆయన కూడా పార్టీ ఆఫీసులో కార్యకర్తగా తన కెరీర్‌ను ప్రారంభించారు. సోషల్ సర్వీస్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ అని స్పష్టం చేశారు సారంగి.
ఎనిమల్ హస్బెండరీ, డెయిరీ, ఫిషరీస్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ మంత్రిగా సారంగి ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిస్సా రాష్ట్రంలోని బాలేసోర్ కు చెందిన సారంగి సామాజిక కార్యకర్తగా ఉన్నారు. ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా ఆయన ఉన్నారు. ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 వరకు 2009 నుండి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా నీలగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు సారంగి. ఉత్కల్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొందారు.
పుట్టుకతోనే ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి. మొదటి నుంచి రామకృష్ణ మఠంలో ఉన్నారు. చాలా సార్లు బేలూరు మఠాన్ని సందర్శించారు. స్వచ్ఛంధంగా సన్యాసం స్వీకరిస్తానని మఠం నిర్వాహకులను కోరారు. కానీ వారు ఒప్పుకోలేదు. తన తల్లికి సేవ చేయాలని, అలాగే ప్రజలకు తోచినంత మేరకు సాయం చేయాలని సూచించారు. దీంతో తన నిర్ణయాన్ని మానుకున్నారు సారంగి. సామాజిక కార్యకర్తగా కొనసాగారు. 1999లో జరిగిన గ్రాహం స్టెయిన్ దహనం జరిగిన సంఘటన సమయంలో ..భజరంగ్ దళ్‌కు నేతగా ఉన్నారు సారంగి.
పిల్లలు చదువుకునేందుకు అనేక స్కూళ్లను ఏర్పాటు చేశారు సారంగి. సమర్ కారా కేంద్రా పేరుతో పేద పిల్లలు చదువుకునేలా చేశారు. గణ శిక్ష మందిర్ యోజన కింద ఆదివాసీ గ్రామాలైన బాలాసోర్, మయూర్ భంజ్ లలో వీటిని ఏర్పాటు చేశారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో వచ్చిన వేతానాన్ని పిల్లల చదువు కోసం నిధులు కేటాయించారు సారంగి. 2014లో బాలాసోర్ ఎంపీకి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం గెలుపు వరించింది. ఏకంగా కేబినెట్‌లో కొలువు తీరేలా చేసింది. దేశ వ్యాప్తంగా సారంగి ఇపుడు హీరో అయి పోయారు. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు , ఇతర ప్రజా ప్రతినిధులు సారంగిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కదూ. సారంగికి కేబినెట్‌లో చోటు కల్పించిన మోదీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి