ద‌క్షిణాదికి మంగ‌ళం - ఉత్త‌రాదికి అంద‌లం - మోదీ, షా మంత్రాంగం

తాజాగా దేశ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చారు. సుస్థిర‌మైన పాల‌న‌, త‌మ బ‌తుకుల‌కు భ‌రోసా క‌ల్పించే పార్టీకే ప‌ట్టం క‌ట్టారు. స‌ర్వే సంస్థ‌లు, న్యూస్ ఏజెన్సీలు, ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాలు, సోష‌ల్ మీడియా సంస్థ‌లు, డిజిట‌ల్ మీడియాల‌న్నీ ఒకే సంఖ్య‌కే ప‌రిమిత‌మై పోయాయి. కానీ మోదీ నేతృత్వంలోని బీజేపీ ని స‌రిగా అంచ‌నా వేయ‌లేక పోయాయి. ఒక‌టి కాదు రెండెంక‌ల సంఖ్య‌కే ప‌రిమిత‌మై పోతుంద‌ని..హంగ్ ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని .మోదీకి తీవ్ర‌మైన ప్ర‌జా వ్య‌తిరేకత బ‌లంగా ఉందంటూ పై పై వార్త‌లు గుప్పుమ‌న్నా అవ‌న్నీ తేలిపోయాయి. ఏ పార్టీలు ఊహించ‌ని రీతిలో క‌మ‌లం ఒక్క పార్టీనే త‌న బ‌లాన్ని నిరూపించుకుంది. 

17వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. ఇది భార‌తీయ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో తిరుగులేని శ‌క్తిగా బీజేపీ అవ‌త‌రించింది. దీనికి అమిత్ షా చేసిన వ్యూహం..ప‌న్నిన ప్లాన్స్ అన్నీ వ‌ర్క‌వుట్ అయ్యాయి. ప్ర‌తిప‌క్షాల‌కు ఊపిరి ఆడ‌కుండా చేశాయి. ఈ తీర్పుతో ప్ర‌జ‌లు మాత్రం బ్ర‌హ్మాండ‌మైన గెలుపును మోదీ చేతుల్లో పెట్టారు. స‌ర్కార్ ఏర్పాటుకు కావాల్సిన మూడొంతుల మెజారిటీని స్వంతంగానే బీజేపీ సాధించింది త‌న ప‌వ‌ర్ ఏమిటో చెప్పింది. ఈ స‌మ‌యంలో అపూర్వ‌మైన విజ‌యాన్ని అందించిన దేశ ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన‌, పార‌ద‌ర్శ‌క‌త‌తో కూడిన పాల‌న అందించాల‌న్న స‌త్ సంక‌ల్పంతో భారీ క‌స‌ర‌త్తు చేశారు మోదీ అండ్ టీం. ద‌క్షిణాది ప‌రంగా చూస్తే క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ , జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వానికి బీజేపీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. త‌మిళ‌నాడులో బీజేపీ హ‌వాను డిఎంకే అడ్డుకుంది.

 38 సీట్ల‌కు గాను ఒక సీటు అన్నా డిఎంకే గెలిస్తే మ‌రో సీటును స్వ‌తంత్ర అభ్య‌ర్థి చేజిక్కించుకున్నారు. మిగ‌తా 36 సీట్ల‌లో స్టాలిన్ పార్టీ విజ‌య‌ఢంకా మోగించింది.
ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి కేవ‌లంఆరుగురికే మోదీ కేబినెట్‌లో చోటు ద‌క్కింది. త‌మిళ‌నాడు నుంచి క‌నీసం అన్నా డిఎంకే అభ్య‌ర్థికి చోటు ద‌క్కుతుంద‌ని భావించారు . కానీ మొండి చేయి చూపించారు. కేవ‌లం ముగ్గురికే చోటు క‌ల్పించారు. తెలంగాణ నుంచి గంగాపురం కిష‌న్ రెడ్డికి హోం శాఖ స‌హాయ మంత్రిగా ప‌ద‌వి ద‌క్కితే ..క‌ర్ణాట‌క నుంచి నిర్మాలా సీతారామ‌న్‌, స‌దానంద‌గౌడ‌ల‌కు కేబినెట్‌లో స్థానం ద‌క్కింది. ఏపీ నుంచి క‌నీసం ఒక్క‌రికి కూడా చోటు ల‌భించ‌లేదు. న‌ర‌సింహారావుకు ప్ర‌యారిటీ ఉంటుంద‌ని అంతా భావించారు. కానీ ఎక్క‌డా ఆ సీన్ క‌నిపంచ‌లేదు. ఇదంతా మోదీ మార్క్ కేబినెట్ గా రూపు దిద్దుకుంది.

 గుజ‌రాత్ నుంచి అమిత్ షాకు కీల‌క‌మైన ప‌ద‌వి ల‌భించింది. యుపీ నుంచి రాజ్ నాథ్ సింగ్, మ‌హారాష్ట్ర నుంచి నితిన్ గ‌డ్క‌రీ, బీహార్ నుంచి రాంవిలాస్ పాశ్వాన్ కు చోటు ద‌క్కింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌కు కీల‌క‌మైన వ్య‌వ‌సాయ శాఖ అప్ప‌గించారు. బీహార్ నుంచి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్, పంజాబ్ నుంచి హ‌రిసిమ్ర‌త్ కౌర్, ఎంపీ నుంచి గెహ్లాట్, డాక్ట‌ర్ ఎన్ జ‌య‌శంక‌ర్ , ఉత్త‌రాఖండ్ నుంచి నిషాంక్, జార్ఖండ్ నుంచి ముండా, యుపీ నుంచి స్మృతీ ఇరానీ, ఢిల్లీ నుంచి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్, మ‌హారాష్ట్ర నుంచి జ‌వ‌దేవ‌క‌ర్, పీయూష్ గోయ‌ల్, ఒడిసా నుంచి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, యుపీ నుంచి ముక్తార్ న‌బ్బాస్ న‌ఖ్వీ, ప్ర‌హ్లాద్ జోషి క‌ర్ణాట‌క నుంచి ఎంపిక చేశారు. 

యుపీ నుంచి పాండే, మ‌హారాష్ట్ర నుంచి సావంత్, బీహార్ నుంచి గిరిరాజ్ సింగ్, రాజ‌స్థాన్ నుంచి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ఉన్నారు. స‌హాయ మంత్రుల వారీగా చూస్తే ..యుపీ నుంచి సంతోష్ కుమార్ గంగ్వార్, హ‌ర్యానా నుంచి రావు ఇంద్ర‌జిత్ సింగ్, గోవా నుంచి య‌శో నాయ‌క్, జ‌మ్మూ కాశ్మీర్ నుంచి జితేంద్ర సింగ్, ఎంపీ నుంచి ప‌టేల్, బీహార్ నుంచి రాజ్ కుమార్ సింగ్, యుపీ నుంచి పూరీ, గుజ‌రాత్ నుంచి మాండ‌నీయ ఉన్నారు. ఎంపీ నుంచి కుల‌స్టే, బీహార్ నుంచి చౌబే, రాజ‌స్థాన్ నుంచి మేఘ్వాల్, హ‌ర్యానా నుంచి గుజ్జ‌ల్, మ‌హారాష్ట్ర నుంచి దాన్వే, అథ‌వ‌లే,  తెలంగాణ నుంచి కిష‌న్ రెడ్డి, గుజ‌రాత్ నుంచి రూపాలా, నిరంజ‌న్ జ్యోతి యుపీ నుంచి చోటు ద‌క్కింది. 

బెంగాల్ నుంచి సుప్రియో, యుపీ నుంచి బాల్క‌న్, మ‌హారాష్ట్ర నుంచి శ్యామ్ రావు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి ఠాకూర్, క‌ర్ణాట‌క నుంచి అంగాడి, బీహార్ నుంచి రాయ్, హ‌ర్యానా నుంచి క‌బారియా, కేర‌ళ నుంచి ముర‌ళీధ‌రన్, ఛ‌త్తీస్‌గ‌ఢ్ నుంచి ప‌రూబా, పంజాబ్ నుంచి సోంప్ర‌కాశ్, అసోం నుంచి థేలీ, ఒడిసా నుంచి సారంగి, రాజ‌స్థాన్ నుంచి చౌద‌రి, బెంగాల్ నుంచి చౌద‌రికి కేబినెట్‌లో స్థానం ల‌భించింది. మొత్తం మీద ఉత్త‌రాదికి భారీ అంద‌లం ల‌భించింద‌నే చెప్పాలి. కీల‌క శాఖ‌ల‌న్నీ వారి చేతుల్లోనే ఉన్నాయి. ఏది ఏమైనా క‌నీసం స‌హాయ మంత్రులుగానైనా ప‌ద‌వులు ఇచ్చినందుకు మోదీకి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాలి. 

కామెంట్‌లు