దుమ్ము రేపుతున్న రాములో రాములా
మాటల మాంత్రికుడు, సక్సెస్ ఫుల్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో..సినిమాకు సంబంధించి రెండో సాంగ్ టీజర్ ను చిత్ర బృందంవిడుదల చేశారు. మొదటి సాంగ్ ను సిరివెన్నెల రాయగా అది యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఇక త్రివిక్రమ్, బన్నీ ల కాంబినేషన్స్ లలో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. బ్లాక్ బ్లస్టర్ గా నిలిచాయి. మరోసారి వీరిద్దరూ కలిసి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్, బన్నీ డైలాగ్స్ , ఫస్ట్ సాంగ్ హిట్ సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. పూర్తి సాంగ్‌ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ‘రాములో..రాములా నన్నాగం చేసిందిరో’అని సాగే పాటకు తమన్ సంగీతం అందించగా.. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాసర్ల శ్యామ్ దీనిని రాశారు. ఇక ఈ పాట కూడా మాస్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్‌లో ఇప్పటి వరకు ఏడు లక్షల లైక్‌లు సాధించిన తొలి తెలుగు పాటగా ‘సామజవరగమన’ చరిత్ర సృష్టించింది.
తాజాగా విడుదల చేసిన రెండో పాట కూడా ఇదే ఊపులో భారీ హిట్ సాధించే అవకాశం ఉంది. త్రివిక్రమ్ అంటేనే సాహిత్యానికి, పంచ్ లు ..ప్రయాసలకు పెట్టింది పేరు. ఆయన సినిమాల్లో మాటలే ఎక్కువగా ప్రభావితం చేసేలా ఉంటాయి. పాత్రల కంటే, హీరో హీరోయిన్ల కంటే ఎక్కువగా స్టోరీ డామినేట్ చేస్తుంది. మినిమమ్ గ్యారెంటీ ఉన్న డైరెక్టర్ గా త్రివిక్రమ్ కు పేరుంది. హీరో, దర్శకులకు ఈ సినిమా సక్సెస్ కావడం ముఖ్యం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి