బెయిల్ వచ్చినా జైలుకే
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఒకప్పటి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కు కాలం కలిసి రావడం లేదు. కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు చిదంబరం హల్ చల్ చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువు తీరడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. మోడీ, అమిత్ షా లు ఇప్పుడు ఒక్కటే టార్గెట్ పెట్టుకున్నారు. దేశమంతటా కాషాయ జెండా ఎగరాలని, ఆ దిశగా పావులు కదుపుతున్నారు. తమకు అడ్డు వచ్చిన వారికి చుక్కలు చూపిస్తున్నారు. అంతే కాకుండా ఆయా నాయకుల ఆర్ధిక మూలాల మీద దెబ్బకొడుతూ కోలుకోలేకుండా చేస్తున్నారు. అంతకంటే ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేస్తూ ఉన్న ప్రతి పార్టీపై వీరిరువురు కన్నేసి ఉంచారు. ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే అమిత్ షా ఎంటర్ కావడం, ఆపై ఐటీ దాడి చేయడం, అనంతరం సీబీఐ రంగం లోకి దిగడం జరుగుతోంది.
దీంతో విపక్షాలకు వాయిస్ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ను టార్గెట్ చేశారు. రేపో మాపో ఆయన కూడా జైలుకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక మిగిలి ఉన్నది నారా చంద్ర బాబు నాయుడు, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా కర్ణాటకలో కీలకమైన రాజకీయ వేత్తగా, ట్రబుల్ షూటర్ గా ఉన్న డీకే శివకుమార్ సైతం జైలుకు వెళ్లారు. కాంగ్రెస్ లో నంబర్ టూ గా ఉన్న చిదంబరం చిప్ప కూడు తింటున్నారు. తాజాగా చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం గానీ, విదేశాలకు పారి పోయే ప్రమాదం లేదని కోర్టు అభిప్రాయ పడింది.
లక్ష రూపాయల వ్యక్తి గత పూచీ కత్తుపై సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే చిదంబరం పూర్తిగా జైలు నుంచి విముక్తి అయ్యే అవకాశం లేదు. ఐఎన్‌ఎక్స్ మీడియా స్కాంకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో ఆయనను ఈడీ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం మీద బెయిల్ వచ్చినా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి చిదంబరానిది. పవర్ పాలిటిక్స్ అంటేనే ఇదేనేమో.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి