జగమీత్ కింగ్ మేకర్..ట్రూడో కే ఛాన్స్

కెనడాలో లిబరల్ పార్టీ అతి కష్టం మీద మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ప్రవాస భారతీయుడైన జగ్మీత్‌ సింగ్ ఇప్పుడు కీలకంగా మారారు. అయన సపోర్ట్ ఇవ్వకపోతే ట్రూడో ఎన్నిక కష్టమవుతుంది. అక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ మొత్తం 338 ఎలక్టోరల్‌ డిస్ర్టిక్ట్స్ కు గానూ 157 డిస్ట్రిక్ట్స్‌లో విజయం సాధించగా, ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ పార్టీ 121లో గెలిచింది. దీంతో ఇతరుల మద్దతుతో లిబరల్‌ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఇండియన్‌ కెనడియన్‌ అయిన జగీ్మత్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించనున్నారు. ఆయన నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్‌ పార్టీ 24 సీట్లు గెలుచుకుని ‘కింగ్‌ మేకర్‌’గా అవతరించింది.

అయితే, 2015 నాటి ఎన్నికల కన్నా ఈ సారి ఆ పార్టీ గెలిచిన స్థానాల సంఖ్య తగ్గింది. ఆ ఎన్నికల్లో ఎన్‌డీపీ 44 సీట్లు గెల్చుకుంది. బ్లాక్‌ క్యూబెకాయిస్‌ 32, గ్రీన్‌ పార్టీ 3 సీట్లు గెలుపొందాయి. బ్లాక్‌ క్యూ బెకాయిస్, గ్రీన్‌ పార్టీ ట్రూడో ప్రభుత్వంలో చేరబోమని ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రూడోకు మరో 13 మంది సభ్యుల మద్దతు అవసరం. పార్లమెంట్‌లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని, కెనడియన్ల హక్కుల కోసం పోరాడుతామని ఈ ఎన్నికల ఫలితాల అనంతరం జగ్మీత్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఈ సింగ్‌ గతంలో క్రిమినల్‌ డిఫెన్స్‌ లాయర్‌గా పనిచేశారు. కెనడా ప్రజలు ప్రగతిశీల అజెండాకు ఓటేశారని ఫలితాల అనంతరం ట్రూడో వ్యాఖ్యానించారు.

గత నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్న ట్రూడో ఈ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వ్యతిరేకతను చవి చూడాల్సి వచ్చింది. ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌తో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూబెక్, అల్బెర్టా తదితర ప్రావిన్స్‌ల్లో ఆయన నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ భారీగా దెబ్బ తిన్నది. ట్రూడో ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని కన్సర్వేటివ్‌ పార్టీ నేత షీర్‌ వ్యాఖ్యానించారు. 2.74 కోట్ల ఓటర్లును కెనడాలో ఈ ఎన్నికల్లో 65% పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో 97 మంది మహిళలు గెలవడం విశేషం. జగ్మీత్‌ సింగ్ కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు.

కామెంట్‌లు