ముంచుకొస్తున్న ఉపద్రవం ..భయపడుతున్న మార్కెట్ రంగం

భారతీయ వ్యాపార రంగంలో టాప్ పొజిషన్ లో ఉన్న రిలయన్స్ గ్రూప్ అఫ్ కంపెనీస్ ఆదాయంలో పరుగులు తీస్తూనే ఉన్నా .. దాంతో పాటే అప్పులు కూడా పెరుగుతూ వస్తున్నాయి . టెలికం రంగంలో నంబర్ వన్ లో ఉన్న ఈ కంపెనీకి మిగతా రంగాలలో అంత గా వర్కవుట్ కాలేదన్నది మార్కెట్ వర్గాల అంచనా. ముఖేష్ అంబానీ , అనిల్ అంబానీ లు రెండు వర్గాలుగు విడిపోయారు. ఇప్పుడు ఇండియాలో ముఖేష్ ఆధ్వర్యంలోని రిలయన్స్ కంపెనీయే తన హవాను కొనసాగిస్తోంది. దేశంలో అత్యంత సంపన్నుడైన వ్యాపారవేత్తగా ముకేశ్ అంబానీ పేరు పొందారు .

ఆ మేరకు ఆయన తన ప్రాబల్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు . కొత్త ప్రాజెక్ట్ లతో ఎప్పటికప్పుడు ఇండియన్ మార్కెట్ ను షేక్ చేస్తున్నారు . అయితే ఇటీవల భారత్ లో కంపెనీలు , వాటి యజమానులు వాటిని నిర్వహణ భారం ఎక్కువ కావడంతో లెక్కకు మించి అప్పులు చేస్తున్నారు . అవి తడిసి మోపెడవుతున్నాయి . తాజాగా కర్ణాటకలో కింగ్ మేకర్ గా ఉన్న సిద్దార్థ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు .ఇంకో వైపు విజయ్ మాల్యా ఇండియాకు రావాలంటే జంకుతున్నారు . ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైంది . మోదీ కొలువు తీరాక భారత ఆర్ధిక పరిస్థితి రెంటికి చెందిన రేవడి లా తయారైంది . తాజాగా ముకేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి అప్పులు విపరీతంగా పెరిగాయని ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థ క్రెడిట్ స్విస్ వెల్లడించింది . 

అది ఏకంగా 4 లక్షల 62 కోట్ల కు చేరుకుందని తెలిపింది. దీంతో రేటింగ్ తగ్గిస్తున్నట్లు పేర్కొంది. దీంతో రిలయన్స్ షేర్లు 3 .48 శాతం మేర నష్ట పోయాయి . వచ్చే నగదు కంటే కంపెనీ నుంచి వెళ్లే నగదు ఎక్కువగా ఉందని తెలిపింది . ముందస్తుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేలా ముకేశ్ అంబానీ ఆలోచిస్తే మంచిది . అయితే రిలయన్స్ కు దేశ వ్యాప్తంగా నిరర్ధక ఆస్తులు ఉన్నాయి. ప్రధాన నగరాల్లో కోట్లు విలువ చేసే ప్లేసెస్ ఉన్నాయి . ఇటీవల ఆయా సిటీస్ లలో రిలియన్స్ టవర్స్ ను అమెరికా కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి అమ్మేసింది . దీని ద్వారా కోట్లాది రూపాయలు వచ్చాయి . ఈ మొత్తం ముఖేష్ కు పెద్దది కాకపోయినా రోజు రోజుకు చెల్లింపులు అనేవి పెరుగుతూ ఉంటాయి .  

కామెంట్‌లు