ఎన్నికలకు ఎప్పుడైనా రెడీ..పాగా కోసం బీజేపీ పక్కా స్కెచ్

ఇండియాలో ఇప్పుడు బీజీపీ హవా నడుస్తోంది . ఆ పార్టీ ఇప్పుడు ఏది అనుకుంటే అది అవుతోంది. ఎప్పుడైతే కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షా కొలు తీరారో ఇక అప్పటినుంచి తమ ప్రణాళికలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇందు కోసం వారికి ఏ పార్టీ పైన గానీ లేక ఇంకెవ్వరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు . ఎందుకంటె గత లోకసభ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.  ఇప్పటికే పలు రాష్ట్రాలలో కాశ్య జెండాను ఎగుర వేశారు. దీనికి మోదీ , షా లా పక్కా ప్లాన్ సక్సెస్ అయ్యింది . రాబోయే రోజుల్లో మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వన్ నేషన్ వన్ పార్టీ ..వన్ కంట్రీ అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు.

తాజాగా సౌత్ లో కీలకంగా ఉన్న కర్ణాకటలో సంకీర్ణ సర్కార్ కు చెక్ పెట్టింది బీజీపీ . దేశ వ్యాప్తంగా కమలాన్ని వికసింప చేయల్లన్న టార్గెట్ తో వర్క్ చేస్తున్నారు మోదీ అండ్ షా . దేశ ఆర్ధిక రంగాన్ని శాసించే మహారాష్ట్రలో బీజేపీ , శివసేన కలిసి సర్కార్ ను ఏర్పాటు చేశాయి . ఇప్పుడు ఆ రాష్ట్రంలో స్వంతంగా అధికారం లోకి రావాలని స్కెచ్ వేసింది . మరోసారి పవర్ లోకి రావాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది బీజేపీ. ఇందు కోసం సంఘ్ పరివార్ కింది స్థాయి నుంచి నరుక్కుంటూ వస్తోంది . ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దేఇషలో అడుగులు వేస్తోంది . ఇప్పటికే మహారాష్ట్రను వరదలు ముంచెత్తాయి . అయినా సర్కార్ అదర లేదు .. అన్ని ఏర్పాట్లు చేస్తోంది . తీవ్ర నీటి కొరత తీర్చేందుకు వాటర్ గ్రిడ్ ప్లాన్ చేస్తోంది . మరో స్టేట్ జార్ఖండ్ లో పాగా వేయాలని పట్టుదలతో ఉంది .

గత ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది . ఇక్కడ 81  సీట్లు ఉంటె బీజేపీ 42 సీట్లు గెలుచుకుంది. హర్యానాలో తిరిగి అధికారం లోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది . మరోసారి పవర్లోకి వస్తామని ధీమాను అక్కడి నేతలు వ్యక్తం చేస్తున్నారు . మరో రాష్ట్రం ఢిల్లీ ..ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కొలువు తీరింది . దేశంలో బీజేపీ గాలివీస్తున్నా ఇక్కడ మోదీ, షా ప్రభావం పని చేయలేదు . ఇది ఓ రకంగా మోదీ, షా కు పెద్ద దెబ్బ. అయినా ఈసారి ఢిల్లీ పీఠం మీద కమలం జెండా ఎగుర వేయాలని షా , మోదీ కంకణం కట్టుకున్నారు .ఇంకో వైపు ఆప్ సర్కార్ తన వంతు ప్రయత్నాలు స్టార్ట్ చేసింది . మొత్తం మీద బీజీపీ ఎలాగైనా సరే ఈ నాలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే మోదీ , షా లు కసరత్తుకు శ్రీకారం చుట్టారు. ఆయా రాష్ట్రాలలో బలమైన విపక్షాలు లేక పోవడం బీజీపీకి అనుకూలంగా మారింది . 

కామెంట్‌లు