ఇక నాగబాబు కనిపించడు
కొణిదెల నాగ బాబు సినిమాల్లో నటుడి కంటే ఎక్కువగా బుల్లితెరలో పేరు తెచ్చుకున్నారు. మోస్ట్ పాపులర్ యాక్టర్ గా వినుతికెక్కారు. మెగా ఫ్యామిలీలో నాగబాబుది ప్రత్యేకమైన శైలి. ఆయన ఎప్పుడూ కూల్ గా ఉంటారు. పూర్తిగా పాజిటివ్ లుక్ తో అలరిస్తూ వస్తున్నారు కొన్నేళ్లుగా. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా, నటుడిగా, నిర్మాతగా పలు కీలక విభాగాల్లో తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చేసిన సినిమాలు కొన్ని ఆడాయి. ఇంకొన్ని కోలుకోలేని రీతిలో నష్టాలకు గురిచేసాయి. ఆర్ధిక పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురైన సమయంలో అదృష్టం బుల్లితెర రూపంలో వచ్చింది.
అదే తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టీవీ ఛానల్ గా కొనసాగుతూ వస్తున్న ఈటీవి నాగబాబు, నటి రోజా లు న్యాయ నిర్ణేతలుగా చేపట్టిన జబర్దస్త్ కార్యక్రమం మరింత పాపులర్ అయ్యింది. ఈ ఒక్క ప్రోగ్రాం ను లక్షలాది మంది వీక్షిస్తున్నారు. ఈటీవికి ఎనలేని డిమాండ్ ఉంటోంది. యూట్యూబ్ లో ఈ ప్రోగ్రాం వీక్షించే వారి సంఖ్య లక్షలను దాటుతోంది. అంటే అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత డిమాండ్ ఉందో. ఈ ప్రోగ్రాం కు హైలైట్ గా నిలిచారు నాగబాబు, రోజా. అయితే జబర్దస్త్ షో ఏకంగా గత ఏడేళ్లుగా తెలుగు బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ వస్తోంది.
కాగా ఎంతో పేరొందిన ఈ షో నుంచి అర్దాంతరంగా నాగబాబు తప్పుకున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇదంతా వాస్తవం కాదంటూ ఆయన అభిమానులు కొట్టి పారేశారు. అయితే తాజాగా గ్గెస్ట్ కామెడీ షో ‘జబర్దస్త్’ నుంచి తాను తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రకటించారు. ఈ ఎపిసోడ్‌తో జబర్దస్త్‌లో తన జర్నీ ముగుస్తుందని చెప్పారు. నాకు ప్రతి గురువారం, శుక్రవారం చాలా ముఖ్యమైన రోజులు. 2013 నుంచి 2019 వరకు జబర్దస్త్‌తో నా ప్రయాణం కొనసాగింది.
ఈ ప్రయాణం మరిచి పోలేనిది. నాకు నేనుగా జబర్దస్త్ నుంచి బయటకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. బిజినెస్‌కు సంబంధించిన ఐడియా లాజికల్ విభేదాల వల్ల బయటకు వచ్చానే తప్ప దీంట్లో ఎవరి తప్పు లేదు. జబర్దస్త్ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డికి థ్యాంక్స్. నేను ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు జబర్దస్త్‌లోకి వచ్చాను. నా స్థాయికి తగ్గటు కాక పోయినా మంచి రెన్యూమరేషన్ ఇచ్చారు. అది నాకు చాలా ఉపయోగపడింది. రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు వచ్చి వెళ్లి పోయాడనేది పచ్చి అబద్ధం.
నేను పారితోషికం కోసమే జబర్దస్త్‌కి రాలేదు. నాకు అది పెద్ద విషయమే కాదు. హాలిడే ట్రిప్పులా ఇన్ని రోజులు షో నడిచింది. ఈ విషయంలో మరోసారి శ్యాంప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నాను. నా జర్నీ ఎలా మొదలైంది. ఎలా క్లోజ్ అయిందనేది తర్వాత రోజుల్లో చెబుతాను అని నాగబాబు మరో ట్విస్ట్ ఇచ్చారు. మొత్తం మీదా లక్షలాది మంది మనసులు దోచుకున్న నాగబాబు లేకుండా జబర్దస్త్ రాబోతుందన్నమాట.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి