అంతిమ పోరులో అద్భుతం


విండీస్ పై అసాధారణ రీతిలో టీమిండియా విజయం సాధించినా అంతిమంగా ఇరు జట్లు సమ ఉజ్జీగా గెలుపు కోసం చివరి వరకు పోరాడాయి. నువ్వా నేనా అన్న రీతిలో గెలుపు దోబూచులాడింది. ఈ ఉత్కంఠ పోరులో ఇండియా తమ ముందు ఉంచిన బిగ్ టార్గెట్ ను ఈజీగా ఛేదించింది. ప్రత్యర్థి జట్టు కూడా తానేమీ తీసి పోనంటూ అద్భుతమైన రీతిలో ప్రదర్శించింది. ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. చివరి మూడో వన్డే మాత్రం మరింత పోటీని పెంచింది. చివరకు ఇండియా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 316 పరుగులు చేసింది. బరిలోకి దిగిన ఇండియా 48.4 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 89 బంతుల్లో 77 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 63 బంతుల్లో 63 పరుగులు చేశాడు. వీరిద్దరూ పెవిలియన్ బాట పట్టక మైదానం లోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.   కేవలం 81 బంతుల్లో 85 పరుగులు చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఉన్నట్టుండి కోహ్లీ అవుటయ్యాడు. ఈ సమయంలో ఫాస్ట్‌ బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఆడిన ఇన్నింగ్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. కీమో పాల్‌ వేసిన 47 ఓవర్‌ తొలి బంతికి కోహ్లి ఔట్‌ కాగా, ఆపై క్రీజ్‌లోకి వచ్చిన శార్దూల్‌ తాను ఆడిన తొలి బంతినే బౌండరీకి పంపించాడు.

ఇక కాట్రెల్‌ వేసిన 48 ఓవర్‌ మూడో బంతిని సిక్స్‌ కొట్టిన శార్దూల్‌.. ఆ ఓవర్‌ నాల్గో బంతిని ఫోర్‌ కొట్టాడు. 6 బంతులు ఆడి 2 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో అజేయంగా 17 పరుగులు  సాధించడంతో ఇండియా సునాయాసంగా విజయం సాధించింది. హ్యాట్స్ ఆఫ్ ఠాకూర్ అంటూ టీమిండియా సారధి కోహ్లీ ముంచెత్తారు. మరో వైపు విండీస్ జట్టు కూడా అసాధారణ రీతిలో టీమిండియాకు పోటీ ఇచ్చింది. 

కామెంట్‌లు