జయహో సుందర్ పిచాయ్

ప్రపంచం ఇప్పుడు గూగుల్ జపం చేస్తోంది. అది లేకుండా ఈ లోకాన్ని చూడలేం. వినలేం. మనల్ని మనం పరిచయం చేసుకోవాలన్నా, ఏ విషయమైనా సరే నిమిషాల్లో కావాలంటే వెంటనే కోట్లాది మందిని ప్రభావితం చేసేది ఈ సెర్చింగ్ దిగ్గజ కంపెనీదే. ఈ అమెరికా ఐటీ కంపెనీ ఇప్పుడు వరల్డ్ లోనే మోస్ట్ టాప్ వన్ గా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో దీనిని దాటి వెళ్లేందుకు మిగతా దిగ్గజ కంపెనీలు సైతం ప్రయత్నం చేస్తున్నాయి. అయినా గూగుల్ తో పోటీపడలేక పోతున్నాయి. ఎందుకంటే గూగుల్ ప్రపంచం కంటే ముందు వరుసలో ఉంటోంది. ఏ కంపెనీ తన దరిదాపుల్లోకి అల్లంత దూరంలో నిలిచి ఉన్నది. దీనిని అందు కోవాలంటే ఇప్పుడు కష్ట సాధ్యమైన పని.

గూగుల్ కంపెనీకి ఇండియాకు చెందిన చెన్నై కుర్రాడు సుందర్ పిచాయ్ సిఇఓ గా ఉన్నారు. ఇప్పటికే సుందర్ వరల్డ్ లోనే అత్యంత ఎక్కువ వేతనం తీసుకుంటున్న ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నాడు. అంతే కాదు వేతన జీవుల్లో టాప్ వన్ గా నిలిచి అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నాడు. ప్రస్తుతం గూగుల్ కె కాకుండా సుందర్ ఆల్ఫా బెట్ ఐటీ కంపెనీకి సైతం సిఇఓగా కొనసాగనున్నాడు. అత్యంత శక్తి మంతమైన సాంకేతిక దిగ్గజాల్లో ఒకరుగా నిలిచిన పిచాయ్‌ ఇపుడు అతి పెద్ద స్టాక్‌ అవార్డును పొందనున్నారు. రాబోయే మూడేళ్ళలో పనితీరు, ఆధారిత స్టాక్ అవార్డు  రూపంలో 240 మిలియన్ డాలర్లుఅంటే సుమారు17వందల కోట్ల రూపాయలు అందుకుంటారు.

అలాగే 2020 నుండి పిచాయ్‌ అందు కోనున్న వార్షిక వేతనం 20 లక్షల డాలర్లు. ఈ మేరకు అల్ఫాబెట్‌ కంపెనీ అందించిన  రెగ్యులేటరీ ఫైలింగులో వెల్లడించింది. గూగుల్‌  సీఈవోగా సుందర్‌ పిచాయ్‌ అందుకున్న వార్షిక వేతనం 1300 కోట్ల రూపాయలు. 2015లో గూగుల్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, పిచాయ్ వార్షిక వేతనం 6,52,500 డాలర్లు. మరుసటి సంవత్సరం అతని ఆదాయం మరింత పెరిందింది. ముఖ్యంగా 199 మిలియన్ల డాలర్ల భారీ స్టాక్ అవార్డును గూగుల్‌ సంస్థ అందించింది. కాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు అద్భుత అవకాశం దక్కిన విషయం తెలిసిందే.

గూగుల్‌ మాతృ సంస్థ, ఆల్ఫాబెట్‌ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లు సంస్థను స్థాపించిన 21 ఏళ్ల తరువాత రిటైర్మెంట్ తీసుకుంటున్న కారణంగా అల్ఫా బెట్‌కు సీఈవోగా  పిచాయ్‌ ఎంపికయ్యారు. దీంతో సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పోరేట్‌గా దిగ్గజంగా అవతరించారు. ఈక్విలార్ ప్రకారం అమెరికాలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన మిడియాన్ సీఈఓ మూల వేతనం 1.2 మిలియన‍్ల డాలర్లు. ఇప్పుడు అతడిని మనోడు బీట్ చేయడం విశేషం.

కామెంట్‌లు