పిట్ట కొంచెం కూత ఘనం
స్టార్ టీవీ ఏ ముహూర్తాన మా టీవీని కొనుగోలు చేసిందో ఇక అప్పటి నుంచి దాని స్వరూపమే పూర్తిగా మారి పోయింది. జనాన్ని మెస్మరైజ్ చేసేలా సీరియల్స్, రియాల్టీ షోస్, ఆకట్టుకునే రీతిలో ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తోంది. బుల్లితెరపై స్టార్ మా టీవీ ఇప్పుడు నంబర్ వన్ పొజిషన్ కు చేరుకుంది. మరో వైపు జీ తెలుగు, జెమిని కూడా మా తర్వాతే ఉంటున్నాయి. ఇటీవల టెలికాస్ట్ చేసిన బిగ్ బాస్ ప్రోగ్రాం ఏకంగా ఇండియాలోనే టాప్ ప్రోగ్రాం గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఎక్కువ ప్రేక్షకాదరణ కలిగిన సీరియల్ గా కార్తీక దీపం నిలిచింది. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్కరు ఒక్క రోజులోనే స్టార్స్ గా మారి పోయారు.
ఈ సీరియల్ లో ఎక్కువగా సౌందర్య, దీప్తి, డాక్టర్ బాబు పాత్రలు ఆకట్టుకోగా పిల్లలుగా నటించిన చిన్నారులు ఎక్కువగా పాపులర్ అయ్యారు. నేను నీ కూతుర్నే అని ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు డాక్టర్ బాబూ, అసలు నేనేం తప్పు చేశాను, మీరే మా నాన్న అని, అమ్మా చెప్పలేదు. మీరు చెప్పలేదు. నాన్నమ్మ, తాతయ్య, బాబాయ్ ఎవ్వరూ చెప్పలేదు. నాన్న కోసం ఎంతగా వెతికానో అందరికీ తెలుసు కదా. ఎందుకు నాన్నా.. మీకు అమ్మ అంటే అంత కోపం. మీకెందుకు ఇష్టం ఉండదు. మీలాగా రంగు లేదనా అంటూ తండ్రిని నిలదీసే పాత్రలో సౌర్య బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
ఈ చిన్నారి పాత్రను ఇష్టపడని అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. కార్తీకదీపం సీరియల్ లో దీప క్యారెక్టర్‌కి ఎంత ప్రాధాన్యత ఉన్నదో దీప కూతురిగా నటించిన సౌర్య పాత్రకు అంతే ప్రాధాన్యత ఏర్పడింది. మనస్పర్ధల కారణంగా విడి పోయిన తల్లిదండ్రుల మధ్య నలిగి పోయే చిన్నారి పాత్రలో సౌర్య అద్భుత నటనను ప్రదర్శిస్తోంది. ఆమె నటనకు జనాలు నీరాజనం పడుతుండటంతో ఈ సీరియల్ ప్రతిరోజు టాప్ రేటింగ్‌లో ఉంటోంది. సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ సీరియల్‌గా ప్రేక్షకులకు తిరుగులేని వినోదాన్ని పంచుతోంది.
తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న డాక్టర్ బాబే తన తండ్రి అని తెలిసినప్పటికీ ధైర్యంగా అతని దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. తల్లిదండ్రుల మధ్య నలిగి పోతున్న ఈ చిన్నారి సౌర్య.. కోట్లాది మంది ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. సౌర్య అసలు పేరు గ్రంధి క్రితిక. ఆమె స్క్రీన్ నేమ్ బేబీ క్రితిక. ఈ చిన్నారి జీ తెలుగులో ప్రసారమైన గీతాంజలి సీరియల్‌తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లి తెరకు పరిచయం అయ్యింది. ఆ సీరియల్ తరువాత అష్టాచెమ్మా, కాంచనమాల, గోపికమ్మ వరుస సీరియల్స్ చేసింది. ఇలా 15కి పైగా సీరియల్స్‌లో నటించింది. ఒక వైపు సీరియల్స్‌లో నటిస్తూనే చదువులోనూ చురుకుగానే ఉంటుంది క్రితిక.
నెలలో మొదటి, చివరి వారాల్లో మాత్రమే షూటింగ్‌లో పాల్గొని మిగిలిన సమయాన్ని చదువుపై పెడుతోంది. సీరియల్స్ తోనే కాకుండా సినిమాల తోనూ బిజీ అయ్యింది క్రితిక. ఇటీవల ఇషారెబ్బా హీరోయిన్‌గా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాగల 24 గంటలు చిత్రంలో నటించి మెప్పించింది. బాలకృష్ణ సింహా చిత్రంలో బాల నటిగా మెప్పించింది క్రితిక. రాహుల్ విజయ్ అరంగేట్రం మూవీ ఈ మాయ పేరేమిటో చిత్రంతో పాటు భీమనేని శ్రీనివాసరావుతో కూడా పని చేసింది క్రితిక. ఇక బోయపాటి జయజానకి నాయక సినిమా అవకాశం మిస్ కావడంతో, తరువాతి చిత్రంలో క్రితికకు అవకాశం ఇచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించబోతుంది సౌర్య. తన బర్త్ డే రోజు విద్యార్దుల ఆకలి తీర్చింది. చిల్డర్స్ డే సందర్భంగా ఓల్డేజ్ హోంకి వాళ్లి వాళ్లకు స్వయంగా వడ్డించి తన పెద్ద మనసు చాటుకుంది బేబీ క్రితిక. చాలా సీరియల్స్‌కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డుల్ని అందుకుంది. తన నటనతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ఈ చిన్నారి మరింతగా ఎదగాలని కోరుకుందాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి