గవర్నర్ తో సీఎం కీలక భేటీ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు ఈ సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ యాక్ట్, ఆర్టీసీ ప్రైవేటీకరణతో పాటు పలు అంశాలపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించారు. ప్రధానంగా ఆర్టీసీపై ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలను కేసీఆర్ గవర్నర్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సంబంధించి కూడా కేసీఆర్ గవర్నర్‌తో చర్చించినట్టు సమాచారం. తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్‌కు రావడం ఇదే తొలిసారి. మేడం బాధ్యతలు చేపట్టాక ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు.
26 డిమాండ్లతో సమ్మెకు దిగారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో, సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. స్వచ్చందంగా ముందు నిలిచారు. అప్పటి ఉద్యమ నాయకుడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచారు. సంస్థను కాపాడుకుంటామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ ఈ సందర్బంగా జరిగిన మీటింగ్ లో సీఎం హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్టీసీలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ట్రేడ్ యూనియన్ టీఎంయూ బంపర్ మెజారిటీతో విజయఢంకా మోగించింది. దీంతో కొంత మేరకు ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెంచడం జరిగింది. కార్మికుల నుంచి పెద్ద ఎత్తున ఆయా ఆర్టీసీ సంఘాల నేతలపై తీవ్ర వత్తిళ్లు వచ్చాయి.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టారు. తెలంగాణ చరిత్రలో ఏకంగా 50 రోజులకు పైగా సమ్మె చేసిన దాఖలాలు లేవు. ఇదే సమయంలో జెఎసి నేతలు, ప్రతిపక్షాలు గవర్నర్ తమిళసైని కలిసి సమ్మెపై పూర్తి వివరాలు అందజేశారు. ఈ ఆందోళనలో ఏకంగా 30 మంది కార్మికులు చని పోయారు. ఇంత జరిగిన, హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం మెట్టు దిగలేదు. చివరకు హైకోర్టు కేసును క్లోజ్ చేసింది. సమస్య తీవ్రం కావడం, ఇతర సమస్యలు ఇంకా కొలిక్కి రాక పోవడంతో వీటి గురించి గవర్నర్ ఆరా తీసింది. ఈ సమయంలో జేఏసీ అనూహ్యంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించింది. మరి తమిళసై , సీఎం కేసీఆర్ ల మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయో తెలియాల్సి ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి