ఏఎన్నార్ ఎప్పటికీ హీరోనే
తెలుగు సినిమా ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వర్ రావు బతికే ఉంటారని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. అంతే కాకుండా ఎప్పటికైనా అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్థాయికి చేరుతుందని వ్యాఖ్యానించారు. ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కినేని భౌతికంగా మన మధ్య లేక పోయినా, మన మనస్సులో జీవించి ఉన్నారని చెప్పారు. చనిపోయే ముందు వరకూ ఆయన ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఏఎన్నార్ జీవితం నాలో స్ఫూర్తి నింపింది. మా అమ్మకు అక్కినేని నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం.
డెలివరీ సమయంలో కూడా అక్కినేని సినిమా చూడాలంటూ అమ్మ పట్టుబట్టి మరీ చూశారట. అందుకే నేమో ఆమె కడుపులో ఉన్న నాకు సినిమాలు అంటే ఇష్టం ఏర్పడిందేమో. అక్కినేని గారితో ‘మెకానిక్ అల్లుడు’ చిత్రంలో కలిసి నటించా. ఆయన చాలా బాగా మాట్లాడే వారు. నాగేశ్వర్ రావు దగ్గరి నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పారు. అక్కినేనితో ఉన్న అనుబంధాన్ని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి, రేఖలకు అక్కినేని పురస్కారం ఇవ్వడం ఎంతో సముచితమైన నిర్ణయం. భారతదేశంతో పాటు ముఖ్యంగా దక్షిణాది గర్వించ దగ్గ నటీమణులు శ్రీదేవి, రేఖ అని వారిద్దర్ని సన్మానించు కోవడం గర్వంగా ఉంది.
ఇక మరణించే ముందు కూడా నటించిన ఏకైక ‘లేడీ సూపర్ స్టార్’ శ్రీదేవి. అలాగే రేఖ చేతలు మీదగా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకోవడం మరిచిపోలేని జ్ఞాపకం. ఇప్పుడు నా చేతుల మీదగా ఆమెకు అక్కినేని పురస్కారం అంద చేయడం చాలా సంతోషంగా ఉంది. రాజ్యసభకు రేఖ వస్తుంటే సభ అంతా నిశ్శబ్దం అయి పోయేది. ఆమెను చూస్తూ అందరూ అలా ఉండి పోయేవాళ్లు. అందుకేనేమో రేఖ ఎక్కువగా సభకు వచ్చేవాళ్లు కాదు. ఇక నా భార్య పేరు సురేఖ అయినా నేను మాత్రం రేఖ అనే పిలుస్తాను చెప్పారు చిరు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి