దేశం మెచ్చిన అసామాన్యుడు
అంతులేని అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన భారత దేశంలో న్యాయ వ్యవస్థకు గణనీయమైన గౌరవాన్ని తీసుకు వచ్చారు ఈశాన్య రాష్ట్రాల నుంచి అత్యున్నత స్థానం అధిరోహించిన ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్. పని చేసింది కేవలం 13 నెలల కాలమే కావొచ్చు. కానీ ఈ దేశం బతికి ఉన్నంత కాలం గుర్తుండి పోయేలా, పలు చారిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారు. ఆయనే ఆ ప్రాంతం నుంచి మొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉన్నారు. ఇది కూడా ఓ రికార్డు. ఇప్పటి వరకు భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు కు 46 మంది ప్రధాన న్యాయమూర్తులుగా పని చేశారు. కానీ ఆ పదవికి మరింత వన్నె తెచ్చింది మాత్రం రంజన్ పని చేసిన కాలం లోనే. పలు కీలక మైన, కొన్నేళ్లుగా పేరుకు పోయిన కేసుల బూజు దులిపారు. అంతే కాదు పూర్తి పారదర్శకత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమాచార చట్టం పరిధిలోకి సిజెఐ కూడా వస్తుందని తేల్చి చెప్పారు.
న్యాయం, ధర్మం అంగడి సరుకుగా మారి పోయిన ప్రస్తుత తరుణంలో గొగోయ్ బాధ్యతలు చేపట్టాక వాటి స్వరూపాన్ని మార్చేశారు. జడ్జీలు అంటే మామూలు మనుషులు అనుకుంటే పొరపాటు. వాళ్ళను దైవానికి ప్రతి రూపాలుగా భావిస్తారు బాధితులు. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత పూర్తిగా మన మీదనే ఉందన్న విషయం మరిచి పోవద్దని హితబోధ చేశారు గొగోయ్. అంతే కాదు మనం మాటల్లో కంటే ఎక్కువగా అధికారాల్లో చూపాలి. మాట్లాడేటప్పుడు చేదు వాస్తవాలను మనసులోనే ఉంచుకోవాలని అన్నారు. ఈ న్యాయ వ్యవస్థకు నమ్మకం, విశ్వసమే బలం అని చాటి చెప్పారు. 1954 లో అస్సాంలో జన్మించిన ఈ ప్రధాన న్యాయమూర్తి మాజీ సీఎం కేశ చంద్ర గొగోయ్ కొడుకు. 1978 లో బార్ లో జాయిన్ అయ్యారు.
గౌహతి హైకోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. 2001 లో పర్మినెంట్ జడ్జ్ గా ఉన్నారు. 2010 లో పంజాబ్, హర్యానా కోర్టుకు బదిలీ అయ్యారు. 2012 లో చీఫ్ జస్టిస్ గా పదోన్నతి పొందారు. ఎన్ ఆర్ సి ప్రక్రియను దేశమంతటా అమలు చేయాలని కీలక తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో గొగోయ్ ఒకరు. కేసులు పేరుకు పోకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుప్రీం కోర్టు జడ్జీల సంఖ్యను పెంచారు. అయోధ్య సమస్యకు పరిష్కారం చూపారు. దీంతో కేంద్ర సర్కార్ ఈ ప్రధాన న్యాయమూర్తికి జెడ్ ప్లస్ భద్రత కల్పించింది. రఫెల్ , శబరిమలలో మహిళల ప్రవేశం, ఫైనాన్స్ యాక్టు అంశాల విషయంలో కీలక తీర్పులు వెలువరించారు. తక్కువ టైం లో కీలక తీర్పులు వెలువరించిన గొగోయ్ సేవలను ఈ దేశం తలుచుకుంటోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి