టిక్ టాక్ సెన్సేషన్..ఇండియా నంబర్ వన్

సోషల్ మీడియాలో ఇప్పుడు చైనాకు చెందిన టిక్ టాక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచంలో తాజా సమాచారం మేరకు అత్యధికంగా ఈ టిక్ టాక్ వీడియో యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. నిమిషాల లోపే ఆడియో, వీడియోలను తయారు చేసుకునే వీలుండటం, క్షణాల్లోపే వరల్డ్ వైడ్ గా పాపులర్ కావడం జరుగుతోంది. చిన్నారుల దగ్గరి నుంచి వృద్ధుల దాకా అంతా టిక్ టాక్ జపం చేస్తున్నారు. నిన్నటి దాకా గేమ్స్ తో కుస్తీ పట్టిన జనం ఇప్పుడు టిక్ టాక్ లోనే జీవితం గడుపుతున్నారు. ఇక దీని ప్రభావానికి కోట్లాది మంది యూజర్స్ దీనిని వాడకుండా ఉండలేక పోతున్నారు. అంతలా టిక్ టాక్ మెస్మరైజ్ చేసేస్తోంది. ఇదిలా ఉండగా టిక్ టాక్ యాప్ సామాజిక మధ్యమ విభాగంలో ప్రపంచ చరిత్ర సృష్టించింది.

దీని వీడియో యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ ప్లే సహా యాప్‌ స్టోర్‌ నుంచి 150 కోట్ల డౌన్‌ లోడ్లను చేరుకోగా 46.8 కోట్ల యూనిక్‌ ఇన్‌స్టాల్స్‌తో భారత్‌ నెంబర్‌ వన్‌గా నిలిచింది. టిక్‌టాక్‌ డౌన్‌లోడ్స్‌లో 31 శాతం భారత్‌ నుంచే కావడం గమనార్హం. 2019లో టిక్‌టాక్‌ గత ఏడాది కంటే ఆరు శాతం అధికంగా 61.4 కోట్ల డౌన్‌ లోడ్స్‌ సాధించిందని మొబైల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ వెల్లడించింది. 2019లో భారత నెటిజన్లు ఇప్పటి వరకూ 27.6 కోట్ల వరకూ టిక్‌ టాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, గ్లోబల్‌ ఇన్‌స్టాల్స్‌లో ఇది 45 శాతం వరకూ ఉంటుందని ఆ నివేదిక తెలిపింది.

ఇక చైనా 4.5 కోట్ల డౌన్‌ లోడ్స్‌తో రెండవ అత్యధిక డౌన్‌ లోడర్‌గా, 3.6 కోట్ల డౌన్‌లోడ్స్‌తో అమెరికా టాప్‌ 3లో నిలిచాయి. టిక్‌టాక్‌ 61 కోట్ల డౌన్‌లోడ్స్‌తో ఈ ఏడాది అత్యధిక డౌన్‌ లోడింగ్‌ నాన్‌ గేమింగ్‌ యాప్‌ విభాగంలో మూడవ స్ధానంలో ఉంది. వాట్సాప్‌ 70.74 కోట్లతో, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ 63.2 కోట్లతో ఈ ఏడాది అత్యధిక డౌన్‌లోడింగ్‌ యాప్‌లుగా టాప్‌ 2 స్ధానాలను దక్కించుకున్నాయి. రానున్న రోజుల్లో టిక్ టాక్ వీడియో యాప్ ను ఇంకెంత మంది డౌన్లోడ్ చేసుకుంటారోనని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

కామెంట్‌లు