గోదావరి గల గల ..కృష్ణమ్మ ..జూరాల కళ కళ ..!
నిన్నటి దాకా నీళ్ల కోసం అల్లాడిన రైతులు ఇప్పుడు ఆనందంలో తేలుతున్నరు. తాగు నీళ్ల కోసం ..సాగు నీళ్ల కోసం అల్లాడి పోయిండ్రు . ఎక్కడ చూసిన ఎండిన పంటలు ..నెర్రెలు బారిన పొలాలు ..మట్టి బిడ్డలను ఆందోళలనకు గురై చేసినవి. అటు ముంబై ని వరదలు ..వర్షాలు ముంచెత్తినవి . జనాన్ని అతలా కుతలం చేసినవి . భారీగా కురుస్తున్న వర్షాల దెబ్బకు జన జీవనం స్థంభించి పోయింది . యెడ తెరిపి లేకుండా కురుస్తున్న వానల తో గోదావరి , కృష్ణమ్మ , తుంగభద్ర , మంజీరా , తదితర నదులన్నీ నిండి పోయినవి . దీంతో ప్రాజెక్టులు జలకళతో కళకళ లాడుతున్నవి.
కృష్ణమ్మ నిండు కోవడంతో అటు జూరాలకు భారీ ఎత్తున వరద నీరు ఎగువన ఉన్న కర్ణాటక నుండి నీరు వచ్చి చేరుతోంది . దీంతో జూరాల ఆయకట్టు రైతులు సంతోషం లో మునిగి తేలుతున్నరు. ఇప్పటికే వరద తీవ్రత పెరగడంతో 24 గేట్లు ఎట్టి వేశారు . లక్షా 80 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. అటు గోదావరిలోను వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది . దీంతో మేడిగడ్డ బ్యారేజి కూడా నిండి పోయింది . ప్రాజెక్ట్ నీటి మట్టం పూర్తిగా నిండి పోయింది . అధికారులు 57 గేట్లు తెరిచి దిగువకు 2 లక్షల 75 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు . కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో కర్ణాటకలోని ఆల్మట్టి , నారాయణపూర్ ప్రాజెక్టులు నిండి పోయాయి. అటు భద్రాచలం వద్ద 40 అడుగుల ప్రవాహం చేరుకుంది.
గత కొంత కాలంగా వరుణ దేవుడు కరుణించక పోవడంతో తెలంగాణ రైతాంగం ఆశలు ఆవిరై పోయినవి . భీమా , నెట్టెంపాడు , కోయిల్ సాగర్ , తదితర ప్రాజెక్ట్లులన్నీపూర్తిగా నిండుకున్నవి. మరో వైపు ప్రాణహిత , ఇంద్రావతి నదులు ఉప్పొంగుతున్నవి ..అవి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నవి. గోదావరిలో ని ఎల్లంపల్లి దిగువన భారీగా వరద వచ్చి చేరుతోంది . మేడిగడ్డ బ్యారేజి కి నీరు చేరడంతో అధికారులు మరో 57 గేట్లు ఎత్తి వేశారు . ఎగువన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మాత్రం వరద నీరు తగ్గింది . ఈ ఒక్క ప్రాజెక్ట్ కు మాత్రమే నీరు అంతగా రాలేదు . వరి తో పాటు అంతర , వాణిజ్య పంటలు సాగు చేయాలనీ రైతులకు వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు . మొత్తం మీద నిన్నటి దాకా వర్షాలు లేక కన్నీటి పాలైన రైతులకు కురుస్తున్న వానలతో కొంత ఉపశమనం కలిగినట్లైంది .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి