పవర్ బిల్లులు చెల్లిస్తేనే భవిష్యత్ ..లేకపోతే పదవులు ఫట్..!
సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు . ఇలా ఎంత కాలం విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు . సర్పంచులు , గ్రామ కార్యదర్శులు , ముసిపల్ చైర్ పర్సన్లు , కార్పొరేట్ లను హెచ్చరించారు .గ్రామ పంచాయతీలు , పురపాలక సంఘాలు ఇంత దాకా వచ్చినా కూడా ఇంకా బకాయిలు ఉండడం దారుణమన్నారు . పాత బకాయిలు ఉంటె వన్ టైం కింద సెటిల్ మెంట్ చేస్తామని చెప్పారు . విద్యుత్ సంస్థల బకాయిలను జీరో కు తీసుకు రావాలని ఆదేశించారు అధికారులను . ప్రభుత్వ ఆఫీసులకు ప్రీ పెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు . నగరాలలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు కోసం కొత్తగా పాలసీని తీసుకు వస్తామని వెల్లడించారు.
ఇక నుంచి విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించక పోతే సర్పంచ్ , గ్రామ కార్యదర్శి ,, మున్సిపల్ చైర్ పర్సన్ , కమీషనర్ల పై వేటు వేస్తామని సీఎం హెచ్చరించారు . రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు . కనురెప్ప పాటులో కూడా కరెంట్ పోవడం లేదని ..ఒక వేళ పోతే ఆయా పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులను వెంటనే విధుల నుంచి తొలగిస్తామని చెప్పారు . ఇప్పటికే విద్యుత్ పరంగా దేశానికే స్ఫూర్తిగా ఉంది మన తెలంగాణ అని అన్నారు కేసీఆర్ . ఇప్పటికే గ్రామాలు, పురపాలికలు పెద్ద మొత్తంలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు .
ప్రభుత్వాలు మారినా ఇంకా గ్రామాలు , పట్ట్టాణాల్లో ఇంకా మార్పులు రాక పోవడం బాధాకరమన్నారు . ఇది మంచి పద్ధతి కాదన్నారు . ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షల్లో సీఎం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు . ఎప్పటికప్పుడు విద్యుత్ బకాయిలు చెల్లించక పోవడం వల్ల అవి వేలు దాటి లక్షలకు చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు . వాడిన కరెంటుకు తప్పనిసరిగా బిల్లులు చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు . సకాలంలో బిల్లులు చెల్లించక పోతే వేటు వేయక తప్పదు . అలాగని విడిచి పెట్టే ప్రసక్తి లేదు . వేలాది రూపాయలు వెచ్చించి 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేస్తుంటే ..ఇలా బిల్లులు చెల్లించ కుండా ఉండటం నేరమే అవుతుందన్నారు . ప్రభుత్వానికి భారీ ఎత్తున విద్యుత్ బిల్లులు ఆయా ప్రభుత్వ శాఖలే చెల్లించాల్సి ఉంది . ఏకంగా 10 వేల కోట్లకు పైగా బిల్లులు వసూలు కావాల్సి ఉన్నది .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి