లాభాల బాటలో రెడ్డీస్

ఫార్మా రంగం ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోంది. తెలంగాణాలో లెక్కలేనన్ని ఔషధ కంపెనీలు కొలువు తీరాయి . మరికొన్ని కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ప్రభుత్వం ప్రమాదకర పరిశ్రమల జాబితాలోకి నెట్టి వేశాయి . తాజాగా డాక్టర్ రెడ్డీస్ ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి . రెవ్ లిమిడ్ బ్రాండ్ ఔషధం అమ్మకంలో భారీ ఆదాయం సమకూరింది ఈ కంపెనీకి. జూన్ మాసాంతానికి ముగిసే నాటికి నికర లాభం పెరిగి 662 , 80 కోట్లకు చేరుకుంది . క్యాప్సూల్స్ బ్రాండ్ ను కెనెడా కంపెనీకి అమ్మేసింది . ఈ ఒప్పందం ద్వారా రెడ్డీస్ గ్రూప్ కు మరో 350 కోట్ల ప్రాఫిట్ దక్కింది.

ఈ ఆదాయం వల్ల కంపెనీకి కొంత బలం చేకూరింది. ఏప్రిల్ - జూన్ కు సంబంధించి 3 శాతం పెరిగి 3 వేల 844 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయంలో గ్లోబల్ జెనరిక్ వ్యాపారం ద్వారా 3 వేల 298 కోట్లు . ఉత్తర అమెరికా మార్కెట్లో అమ్మకాలు 1632 కోట్లు.రెడ్డీస్ కంపెనీ అయిదు కొత్త ప్రోడక్ట్స్ ను తీసుకు వచ్చింది . టెస్టోస్టిరోన్ జెల్ , విటమిన్ కె , టొబ్రామైసిన్, ఓటీసి కాల్షియం , కార్పొనేట్ తో పాటు మరో మందును మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది . మరి కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముడు పోక పోవడంతో భారీగా నష్టాలను చవి చూస్తోంది కంపెనీ.

అయితే తమ కంపెనీకి సంబంధించి అప్పులు ఎక్కువగా లేక పోవడం కూడా ఓ రకంగా మరింత ఆదాయం గడించేందుకు దోహద పడింది. వ్యాపార పరంగా రెడ్డీస్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది . ఇప్పటి దాకా సీఓఓ గా ఉన్న ఇజ్రేలిని ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా నియమిస్తున్నట్లు బోర్డు డైరెక్టర్లు వెల్లడించారు. అయితే రోజూవారీ కార్యకలాపాల నుండి తప్పుకుని మేనేజింగ్ డైరెక్టర్ గా భాద్యతలు చేపట్టనున్నట్లు కో చైర్మన్ ప్రసా
ద్ తెలిపారు .

కామెంట్‌లు