వ్యాపారం ..విషాదం ..రాజకీయం ..సిద్దార్థ జీవితం..!

కోట్లాది రూపాయల వ్యాపారం ..లెక్క లేనంతటి ఆస్తులు ..వేలాది మందికి కొలువులు ఇచ్చిన ఈ విజయవంతమైన బిజినెస్ మెన్ చివరకు మనసుకు శాంతి కరువై జీవితం నుంచి అర్ధాంతరంగా వైదొలిగారు. వ్యాపారంలో వున్నా వారు ..రావాలని అనుకున్న వారు సిద్దార్థ జీవితం ఒక లెసన్ గా తీసుకోవాలి. కాఫీ కింగ్ గా మార్చిన ఘనత ఆయనదే . చిక్ మంగళూరు కు చెందిన ఈ అరుదైన వ్యాపార వేత్త గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పులు ఎక్కువగా ఉండటం ..ఉన్న ఆస్తులు అమ్మితే ఎక్కడ తన కంపెనీ బ్రాండ్ విలువ తగ్గిపోతుందని భావించిన ఆయన చివరకు ఆత్మహతే శరణ్యమని నమ్మారు. వేలాది మందిని శోక సంద్రంలో నెట్టేశారు. 

గౌతమ్ సిద్దార్థ ఆత్మహత్య కార్పొరేట్ రంగాన్ని కుదిపేసింది. ఆయన మరణం పలు వ్యాపార వేత్తలను ఆలోచించుకునేలా మార్చేసింది. ఈ విషయం నిజం కాదేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు కొందరు. కానీ అనుకోనిది జరిగింది . తీవ్రమైన వత్తిళ్ళను ఆయన కొంత కాలం పాటు ఎదుర్కొన్నారు . ఇది ఒక రకంగా మానసికంగా చితికి పోయారు .రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబమే అయినా ..సిద్దార్థ ఎందుకు ఇలా చేశారన్నది ఎవరికి అర్థం కావడం లేదు .కాఫీ డే ను స్థాపించి కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడిస్తున్న సమయంలో సూసైడ్ చేసుకోవడం సంచలనం కలిగించింది. 

ఆయన మరణం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది . తాను చనిపోయే టప్పుడు ఓ లేఖను కూడా రాసారు. ఓ మాజీ ఐటి అధికారి వేధింపులే కారణమని పేర్కొనడం మరింత చర్చకు దారి తీసింది . దేశ వ్యాప్తంగా ఆయన చావుపై తీవ్ర సంతాపం వ్యక్తమైంది. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ వ్యాపార వేత్తలపై కొరడా జులుపిస్తోందని, తమకు నచ్చని వారిని టార్గెట్ చేస్తోందని ఆరోపణలు వచ్చాయి . వ్యాపారులు ఇప్పుడు వ్యాపారం చేసే అవకాశం లేదని వాపోయారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు . కార్తీ చిదంబరం , మెహబూబా , సిద్దిరామయ్య , ఎస్ .ఎం. కృష్ణ , కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప , మాజీ సిఎం కుమార స్వామి , కేటీఆర్ , చిదంబరం , రాహుల్ గాంధీ , ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో సిద్దార్థ లేక పోవడంపై సంతాపం ప్రకటించారు . మొత్తం మీద సిద్దార్థ మరణం గుణపాఠం కావాలి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!