బౌలర్ల ప్రతాపం - భారత్ విజయం - ఇంటిదారి పట్టిన విండీస్..
సమిష్టిగా ఆడితే ఏ జట్టయినా ఈజీగా విజయం సాధిస్తుందనడానికి విండీస్ తో జరిగిన మ్యాచే. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఒక్కో విక్టరీ సాధిస్తూ ఇండియా క్రికెట్ జట్టు తన సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇతర జట్లకు సవాల్ విసురుతోంది. అటు బౌలింగ్‌లోను, ఇటు బ్యాటింగ్‌లోను రాణిస్తూ వస్తున్న ఈ జట్టు ..కప్‌పై కన్నేసింది కోహ్లి సేన.భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో విండీస్ ఆటగాళ్లు ఏ మాత్రం పోరాట పటిమను ప్రదర్శించలేక పోయారు. కేవలం 143 పరుగులకే ఆలౌటయ్యారు. దీంతో ఇండియా జట్టు నాకౌట్‌కు మరింత చేరువైంది. కరేబియన్ల జట్టులో పంచ్ హిట్టర్స్ గా పేరున్న క్రిస్ గేల్, సై హోప్, హెట్మయర్ , బ్రాత్ వైట్ లలో ఎవరో ఒకరు నిలబడినా ఇండియా నిర్దేశించిన టార్గెట్ అంత పెద్దదేమీ కాదు.
బౌలర్లు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. వీరి బంతులను ఎదుర్కోవడానికి, పరుగులు చేసేందుకు విండీస్ బ్యాట్స్ మెన్స్ ఇబ్బందులు పడ్డారు. స్కోర్ పెంచడం కంటే డిఫెన్స్ ఆడడం మొదలు పెట్టారు. బ్యాటింగ్ కఠినంగా సాగిన ఈ మైదానంపై మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు జట్టును నిలబెట్టారు. ఈ గెలుపుతో సెమీస్‌కు చేరువ కాగా ..వెస్టిండీస్ నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ షమి, బుమ్రా, చాహల్ ల ధాటికి కుప్ప కూలింది. షమి 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, బుమ్రా 9 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, చాహల్ 39 పరుగులు ఇచ్చి మరో రెండు వికెట్లు కూల్చారు. ఆంబ్రిస్ ఒక్కడే 31 పరుగులు చేశాడు.
అంతకు ముందు మైదానంలోకి దిగిన ఇండియన్ జట్టు కెప్టెన్ కోహ్లి 82 బంతులు ఆడి 72 పరుగులు చేసి స్కోర్‌లో కీలక భూమిక పోషించాడు. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి. మాజీ కెప్టెన్ ఎం.ఎస్.కె.ధోనీ అసలైన సమయంలో తన ప్రతిభను ప్రదర్శించాడు. 61 బంతులు ఆడి 3 ఫోర్లు 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఏడు వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో పవర్ ఫుల్‌గా ఆడిన కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యారు. టోర్నమెంట్‌లో ఇండియా జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడగా ..ఒక మ్యాచ్ వర్షం కారణంగా నిలిచి పోయింది. మిగతా ఐదు మ్యాచ్‌లు గెలుపొందింది. ఇంక విండీస్ 7 మ్యాచ్‌లు ఆడగా 5 మ్యాచ్‌లు ఓడింది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి వున్నా సెమీస్ కు పోయే అవకాశం లేదు. మొత్తం మీద బౌలర్లు అసలైన సమయంలో రాణించడం భారత జట్టుకు కలిసి వచ్చింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి