మహిళల భద్రత..మీదే బాధ్యత
దేశాన్ని కాపాడటంలో మీరు నిర్వహిస్తున్న పాత్ర గొప్పది. అలాగే ఈ దేశ ప్రజలు మీకు రుణపడి ఉన్నారు. అయితే సమాజంలో సగభాగం కలిగిన మహిళలు, యువతులు, బాలికలకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత మాత్రం మీమీదే ఉందని అన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ. రక్షణ కల్పించడంలో పోలీసులు సమర్థవంతమైన పాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. పుణెలో 54వ డీజీపీ, ఐజీపీల జాతీయ సదస్సులో మోడీ ప్రసంగించారు. పోలీసుల గౌరవాన్ని పెంచేలా అధికారులు కృషి చేయాలని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు..ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రతపై విశ్వాసం పెంచాలని కోరారు. ఎన్ని చట్టాలు చేసినా ఇంకా ఎక్కడో ఒక చోట దారుణం జరుగుతోంది.
మరింత కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు, ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సాధారణ పౌరుల నమ్మకాన్ని చూరగొనేందుకు, పోలీసింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించు కోవాలని మోడీ సూచించారు. పోలీసు అధికారులు నిత్యం విధి నిర్వహణలో ఎదుర్కొనే సవాళ్ల గురించి తనకు తెలుసన్నారు. ఇలాంటివి ఎన్ని ఉన్నా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైనప్పుడు ఉన్న ఉత్సాహం, ఆదర్శ భావాలను మనసులో ఉంచుకుంటూ జాతి హితం, సమాజంలోని పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.
కాగా దేశ అవసరాలకు అనుగుణంగా చట్టాలను మార్చేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. భారతీయ శిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లను మెరుగు పరిచేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అన్ని రాష్ట్రాలను హోం శాఖ కోరిన నేపథ్యంలో ఆయన ఈ విషయం వెల్లడించడం గమనార్హం. సార్క్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సార్క్ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కోవడంతో పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి