బూతు చూస్తే జైలుకే
తెలిసీ, తెలియక ఒకవేళ పోర్న్ గనుక చూస్తే ఇక జైలుపాలు కాక తప్పదు. ఈ విషయాన్ని తమిళ పోలీసులు అందరికంటే ముందంజలో ఉన్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్‌లు, ఆన్‌లైన్ సౌకర్యంతో స్మార్ట్ టీవీలు ఉన్నాయి కదా అని అదే పనిగా గంటల కొద్ది అశ్లీల వీడియోలను వీక్షిస్తే, ఇక సైబర్ క్రైంకు చిక్కినట్టే. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని గుర్తించే పనిలో పోలీసులు బిజీ అయ్యారు. హెచ్చరికల్ని ఖాతరు చేయకుంటే, ఏడేళ్లు జైలు శిక్ష విధించేందుకు తగ్గట్టుగా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో పోర్న్ వీడియోలను వీక్షిస్తున్న మూడు వేల మందిని గుర్తించి, వారికి క్లాస్ పీకేందుకు సైబర్ క్రైం సిద్ధం అయింది.
ఈ మేరకు ఓ యువకుడికి పోలీసు లు వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. పోర్న్ వీడియోలను వీక్షించే వారి సంఖ్య భారత్‌లో అత్యధికంగా ఉన్నట్టు ఓ సర్వే తేల్చి చెప్పింది. ఇష్టారాజ్యంగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యే ఈ వెబ్ సైట్లను అరికట్టడం సైబర్ విభాగానికి పెద్ద సమస్యే. ఈ వీడియోలకు తగ్గట్టుగానే, ఇటీవల కాలంగా మహిళలు, యువతులు, పిల్లలల మీద లైంగిక దాడులు, ఉన్మాద చర్యలు పెరిగి ఉన్నాయి. హైదరాబాద్‌లో సాగిన దిశా హత్య ఉదాంతం తదుపరి రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్తల్లో పడింది. మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించే రీతిలో దూకుడు పెంచి ఉన్న పోలీసుల యంత్రాంగం మరో అడుగు ముందుకు వేసింది.
అశ్లీల వీడియోలను అదే పనిగా గంటల కొద్ది వీక్షించే వారి భరతం పట్టే రీతిలో పోలీసులు కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అయ్యారు. వెబ్ సైట్లలో అశ్లీల వీడియోలను వీక్షించే వారిని గుర్తించే పనిలో సైబర్ క్రైం విభాగంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగి ఉన్నది. చిన్న పిల్లల్ని, మైనర్లను అశ్లీలంగా చిత్రీకరించి తీసిన వీడియోలే కాదు. అశ్లీల సైట్స్‌ల్లో గంటల కొద్ది గడిపే వారిని గుర్తించి వారి భరతం పట్టే విధంగా పోలీసులు దూకుడు పెంచారు. తమిళనాట మూడు వేల మంది నిత్యం పోర్న్ వీడియోల మీదే దృష్టి పెట్టి ఉన్నట్టుగా ఇప్పటి వరకు తేల్చారు. జిల్లాల వారీగా సేకరించిన సమాచారాల ఆధారంగా, వారి వారి ఫోన్ల, ఇతర ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని గుర్తించే పనిలో పడ్డారు.
ఈ మూడు వేల మందిని పిలిపించి క్లాస్ పీకేందుకు రెడీ అవుతున్నారు. అశ్లీల వీడియోలను వీక్షించినా, డౌన్‌లోడ్ చేసినా, షేర్ చేసినా నేరంగా పరిగణించి, అటి వారిని తొలుత హెచ్చరించడం, ఖాతరు చేయని పక్షంలో ఏడేళ్లు జైలు శిక్ష విధించే దిశగా కేసుల్ని పెట్టేందుకు తగ్గట్టుగా ప్రత్యేక కార్యచరణతో ఆ బృందం ముందుకు సాగుతోంది. ఈ దృష్ట్యా, అశ్లీల వీడియోలను అదే పనిగా గంటల కొద్ది చూసే వాళ్లు, ఉన్మాదంతో వ్యవహరించే వాళ్లు, కామాంధులు ఇకనైనా జాగ్రత్త పడితే సరి లేదా.. వీడియోల రూపంలో ఏడేళ్ల పాటు కటకటాల్లో కాలం గడపాల్సిన పరిస్థితి తప్పదు. అందుకనే జరజగ్రత్తగా ఉండడం మంచిది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి