సరిలేరు నీకెవ్వరూ తమన్నా
తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా చెలామణి అవుతున్న ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి తన రికార్డును తానే అధిగమించే పనిలో పడ్డాడు. ఎఫ్ - 2 సినిమా బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచేలా చేసిన డైరక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సరి లేరు నీకెవ్వరూ అంటూ ఓ సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే దాదాపు సినిమా షూటింగ్ పూర్తి కావొస్తోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం స్థూడియోలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎలాగైనా సరే వచ్చే సంక్రాంతి పండుగ కు సరిలేరు నీకెవ్వరూ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఈ సినిమాపై మహేష్ బాబు భారీ గా నమ్మకం పెట్టుకున్నాడు.
అంతకు ముందు మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం , స్పైడర్ సినిమాలు నిరాశ పరిచాయి. కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ సినిమాలుగా నిలిచాయి. ఓవర్ సీస్ లో కూడా మహేష్ బాబుకు మాంచి డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరూ సినిమా విడులా కాకుండానే రికార్డ్ బ్రేక్ చేసేందుకు రెడీ అవుతోంది. మహేష్ బాబు లుక్స్, డ్రెస్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. ఈ మూవీలో మహేష్ మిలిటరీ నేపథ్యంలో సాగే కథను ఎంచుకున్నారు. ఇందులో ఒక పాటకు ప్రముఖ నటి తమన్నా నటించనున్నారు. ఇక కర్నూల్ లో చారిత్రాత్మకమైన కొండా రెడ్డి బురుజును పోలిన బురుజును రామోజీ స్టూడియోలో వేశారు.
ఇందు కోసం ప్రత్యేకంగా సెట్ వేయించారు. చాలా కాలం తర్వాత విజయశాంతి ఓ ప్రత్యేకమైన పాత్రలో అలరించ బోతున్నారు. స్పెషల్ సాంగ్స్ ను క్రియేట్ చేయడంలో పేరున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు రంజైన గీతాలకు మ్యూజిక్ ఇచ్చే పనిలో ఉంటున్నాడు. అయితే దేవిశ్రీ అంటే ఇష్టపడే తమన్నా మాత్రం ఉబ్బి తబ్బివుతోంది..మహేష్ తో నటించడం. మొత్తం మీద మహేష్ క్రేజ్..అనిల్ రావి పూడి డైరెక్షన్ , దేవిశ్రీ మ్యాజిక్ తో ..సరిలేరు నీకెవ్వరూ సినిమా ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి