అట్లీ క్రియేషన్..విజిల్ సెన్సేషన్


ఎవరీ అట్లీ అనుకుంటున్నారా. తమిళ సినిమాలో సునామీలా దూసుకు వచ్చాడు. తనకంటూ ఓ బ్రాండ్ ను ..ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని..సక్సెస్ బాటలో నడుస్తున్నాడు అట్లీ. ప్రముఖ దిగ్గజ దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవంతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు ఈ యువ దర్శకుడు. కొన్ని సినిమాలే చేసినా అవి మాత్రం బ్లాక్ బ్లస్టర్ గా నిలిచాయి. తాజాగా 187 కోట్లతో విజయ్ తో చేసిన విజిల్ సినిమా విడుదల కాకుండానే ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేసింది. ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేసింది. అంతే కాకుండా అందులో విజయ్ నటన పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఇదంతా అట్లీ చలవే. ఎవరిని ఎలా వాడు కోవాలో అట్లీకి బాగా తెలుసు.

రీల్ పరంగా పూర్తి కమిట్మెంట్ తో ఉండే ఈ డైరెక్టర్ టేకింగ్ విషయంలో తనకు తానే సాటి. విజిల్ సినిమాను దేశ వ్యాప్తంగా దీపావళి పండుగకు విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. సినిమా రైట్స్ కోసం  పలువురు పోటీ పడుతున్నారు. తమిళనాడులో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా బాలీవుడ్ లో మాత్రం ఎవ్వరికి ఇచ్చారనే విషయం  ఇంకా వెల్లడించలేదు.  అయితే విజిల్ సినిమాకు అట్లీ ఏకంగా 28 కోట్లు తీసుకున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా బాలీవుడ్ దిగ్గజ నటుడు షారుఖ్ ఖాన్ ఏకంగా 30 కోట్లు ఇచ్చి , సినిమా చేయబోతున్నట్టు వైరల్ అయ్యింది.

అట్లీ గొప్ప దర్శకుడిగా ఇప్పటికే పేరు తెచ్చుకోగా, మరో వైపు అద్భుతమైన ప్రేమికుడిగా వినుతికెక్కారు. ఆయన తమిళ సినిమాలో పేరున్న నటి ప్రియ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అట్లీ అంటే విజయ్ కు అభిమానం. ప్రేమ విఫలం తర్వాత జీవితం ఉంటుంది. ప్రేమలో ఓడిపోయాక కూడా ప్రేమ నిలిచే ఉంటుంది అంటూ తన సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేసిన అట్లీ యూత్ ను ఎంతగానో ప్రభావితం చేశాడు. రాజా రాణి అట్లిది మొదటి సినిమా. ఈ మూవీ కోట్లు కురిపించింది. మొత్తం మీద అట్లీ ప్రేమికుడు..భావుకుడు..మనకు దక్కిన దర్శకుడు. ఇలాంటి వాళ్ళే ఇండియాకు కావాలి. విజిల్ మరింత సక్సెస్ సాధించాలని ఆశిద్దాం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!