ఇంటర్నెట్ సర్చింగ్ లో మోదీనే టాప్
సమున్నత భారతం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకుని, డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకుని, ఇటు ఇండియాలో అటు ప్రపంచ మంతటా తన హవాను కొనసాగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఇంటర్నెట్ (అంతర్జాలం) లో సెర్చింగ్ లో మొదటి స్థానంలో నిలిచాడు. తన రికార్డు ను తానే అధిగమించాడు. దేశంలో రెండవ సారి భారతీయ జనతా పార్టీని అధికారం లోకి తీసుకు వచ్చిన ఘనత మోడీదే అని చెప్పక తప్పదు. కాషాయ దళంలో తలపండిన నేతలు ఉన్నా మోదీ చరిష్మా ముందు తేలి పోయారు. తాను నమ్మిన బంటుగా భావించే కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తో కలిసి పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా దేశమంతటా కాషాయ జెండాలు రెపరెప లాడాలని మోదీ ఇప్పటినుంచే చాప కిందా నీరులా పార్టీని తీసుకు వెళ్లే ప్రయత్నంలో నిమగ్నమై పోయారు.
అంతర్జాతీయ పరంగా చూస్తే ఇప్పుడు మోదీ జపమే వినిపిస్తోంది. మరో వైపు జమ్మూ, కాశ్మీర్ విషయంలో 370 ఆర్టికల్ ను రద్దు చేశాక మోదీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. హ్యూస్టన్ లో జరిగిన మీటింగ్ లో ట్రంప్ తో కలిసి ఆయన మాట్లాడిన తీరుకు కోట్లాది మంది ఫిదా అయ్యారు. అంతే కాకుండా అమెరికన్స్ మనసు దోచుకున్నారు కూడా. దీంతో ప్రతి ఒక్కరు ఎవరీ మోదీ అంటూ వెతికారు. ఈ విషయాన్నీ గూగుల్ కంపెనీ వెల్లడించింది. ఇండియా పరంగా చూస్తే మోస్ట్ పాపులర్ లీడర్ గా భారత ప్రధాని మోదీ మొదటి ప్లేస్ లో నిలిచారు. అంతే కాకుండా తాజాగా చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో సమావేశ కావడం కూడా ఆయనను మొదటి స్థానంలో వచ్చేలా చేసింది.
సోషల్ మీడియాలో ఎక్కువగా చురుకుగా ఉండే మోదీ ఏది చేసినా ఓ సంచలనమే. 2018 - 2019 కాలంలో 7. 24 మిలియన్స్ జనం మోడీ కోసం వెదికారు. ఇదే విష్యానాన్ని అమెరికాకు చెందిన సెం రష్ కంపెనీ ఈ వివరాలు వెల్లడించింది. రెండవ పొలిటీషియన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయన కోసం 1.5 మిలియన్స్ సెర్చ్ చేశారు. అయితే మోస్ట్ పాపులర్ ఉమెన్ లీడర్స్ లలో ప్రియాంక గాంధీ నిలిచారు. సామజిక మాధ్యమాలలో సైతం మోదీ హవా కొనసాగుతూనే ఉన్నది. మోదీ వాడుకున్నంతగా ఐకే లీడర్ వాడు కోవడం లేదు. ఆయన మొదటి నుంచి టెక్నాలజీని వాడు కోవాలని కోరుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి