నిలిచేదెవ్వరు..గెలిచేదెవ్వరో


తెలుగు బుల్లితెరపై జనాదరణతో దూసుకెళుతున్న బిగ్ బాస్ ముగిసేందుకు ఇంకొన్ని రోజులు మాత్రమే ఉన్నది. దీంతో ఎవరు ఫైనల్ కు చేరుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. తాజాగా వరుణ్ వైఫ్ వితిక అనూహ్యంగా ఎలిమినేటి అయ్యింది. సింగర్ రాహుల్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో లో అంతిమ విజేతకు భారీ ప్రైజ్ మనీ దక్కనుంది. ఇక వితిక వెళ్లి పోవడంతో పార్టిసిపెంట్స్ లలో ఆరుగురు మాత్రమే మిగిలారు. వీరిలో బాబా భాస్కర్, వరుణ్ , రాహుల్, శివ జ్యోతి , శ్రీ ముఖి, ఆలీ రజా ఫైనల్ కోసం బరిలో ఉన్నారు. అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

ఇక బిగ్‌బాస్‌ షో ముగింపునకు వస్తుండటంతో హౌస్‌లో టాస్క్‌లు మరింత కఠినతరం కానున్నాయి. దీంతో ఇంటి సభ్యుల మధ్య రసవత్తర పోరు సాగనుంది. మరో పైపు పద్నాలుగో వారానికి ఎవరు నామినేట్‌ అవుతారు అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈసారి బిగ్‌బాస్‌ నామినేషన్‌ ప్రక్రియను కాస్త భిన్నంగా చేపట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్‌ షో ఫైనల్‌కు ఇంటి సభ్యుల్లో ఒకరిని నేరుగా పంపే అవకాశాన్ని ఇచ్చాడు.

దీనికోసం ఇంటి సభ్యులతో టాస్క్‌ ఆడించనున్నాడు. ఇందులో గెలిచే ఏకైక వ్యక్తికి టికెట్‌ టు ఫినాలే దక్కనున్నట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ఫైనల్‌ బెర్తు కోసం వరుణ్‌, రాహుల్‌ హోరాహోరీగా పోరాడుతున్నారు. నా గేమ్‌ కూడా నువ్వే ఆడు అంటూ వెళ్లే పోయే ముందు వితిక ఇచ్చిన సలహాను వరుణ్‌ ఆచరణలో పెట్టినట్లు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా వరుణ్‌.. రాహుల్‌తో తలపడుతున్నాడు. ఈ క్రమంలో టాస్క్‌ హింసాత్మకంగా మారినట్టు కనిపిస్తోంది. ఫైనల్‌గా టికెట్‌ ఎవరు గెలుచుకున్నారు? అందు కోసం ఇంటి సభ్యులకు ఎలాంటి టాస్క్‌ ఇచ్చారు? టాస్క్‌ హింసాత్మకంగా మారిందా అన్న విషయాలు తెలియాలంటే ఎపిసోడ్‌ ప్రసారమయ్యే వరకు వేచి చూడక తప్పదు. 

కామెంట్‌లు