ఆర్టీసీ సమ్మెపై తమిళిసై ఆరా..?
రోజు రోజుకు తెలంగాణాలో ఉధృతమవుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఆరా తీసినట్టు సమాచారం. తమ సంస్థను వెంటనే ప్రభుత్వ పరం చేయాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. అంతకు ముందు ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ సంస్థలోని అన్ని కార్మిక సంఘాలు నోటీసులు అందజేశాయి. దీంతో పాటు రాష్ట్ర కార్మిక శాఖ, ప్రభుత్వానికి సైతం ఇవే నోటీసులు ఇచ్చాయి. అయినా సర్కార్ నాన్చుతూ రాగా, సంస్థ అధికారులు, మంత్రి పట్టించు కోలేదని కార్మిక నేతలు ఆరోపించారు. ఇదే సమయంలో హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని, 49 వేల మంది కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ స్వయంగా కేసీఆర్ స్పష్టం చేశారు.
దీనిని తట్టుకోలేక ఇద్దరు కార్మికులు డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర సురేందర్ గౌడ్ ఆత్మహత్యలు చేసుకున్నారని కార్మికులు వాపోయారు. పరిస్థితి తీవ్రం కావడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి, థామస్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వత్తిళ్లు పెరగడంతో పోలీసులు విడుదల చేశారు. అంతకు ముందు అన్ని పార్టీలు, ప్రజా, విద్యార్ధి సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు సంఘీభావం ప్రకటించారు. బీజేపీ ప్రెసిడెంట్ లక్షణ్ కంటికి గాయమైంది. దీనిపై కేంద్ర బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఈ సంఘటనపై ఆరా తీశారు. మరుసటి రోజు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నేతలు గవర్నర్ ను కలిసి ప్రస్తుత పరిస్థుతుల గురించి వివరించారు.
మరో వైపు బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు కలిసి కార్మికుల ఆత్మహత్యల గురించి తెలిపారు. ఇదే సమయంలో అసలు ఏం జరుగుతోందంటూ రాజ్ భవన్ నుంచి ఫోన్ రావడంతో రవాణా శాఖా ఉన్నతాధికారులు హుటాహుటిన గవర్నర్ దగ్గరకు వెళ్లారు. తమిళిసై మొత్తం వివరాలతో రవాణా శాఖా మంత్రి తన వద్దకు రావాలని ఆదేశించినట్టు సమాచారం. శుభవార్తతో కార్మికులు, ప్రభుత్వం రావాలని కోర్టు కోరింది. దీనిపై సీఎం సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు అధికార పార్టీ సీనియర్ నేత కేశవరావు సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా వెంటనే ఆర్టీసీకి పూర్తి స్థాయిలో ఎండీని నియమించాలని, వేతనాలు చెల్లించాలని కోర్టు ఆదేశింది. అయితే ఢిల్లీకి గవర్నర్ వెళ్లి అమిత్ షా, మోడీని కలిసి సమ్మె పై వివరించారు. మొత్తం మీద ఏదో జరగబోతోందన్న ఉత్కంఠ జనంలో నెలకొన్నది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి