ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ నాన్ ఎంప్లొయీస్ యూనియన్ (టీఎన్జీవో) సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీఎన్జీవో నాయకులు కారెం రవీందర్ రెడ్డి, మమతలు తాము కార్మికుల పక్షమేనని స్పష్టం చేశారు. మరో వైపు తమకు మద్దతు తెలపకుండా టీఎన్జీవో నేతలు ముఖ్యమంత్రితో భేటీ కావడంపై ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి, థామస్ రెడ్డిలు మండి పడ్డారు. మరో వైపు సీఎమ్ మాట వినక పోవడం, చర్చల ఊసెత్తక పోవడం, కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ ప్రకటనలు చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు నోరు మెదపక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ సమాజం, సోషల్ మీడియా అంతటా నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంకో వైపు అన్ని జిల్లాలలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కార్మికులకు అండగా నిలవాలని వత్తిళ్లు తీసుకు వచ్చారు. అధికార పార్టీ తప్ప అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, ప్రజాస్వామిక వాదులు ఉద్యోగుల తీరు గర్హనీయమని పేర్కొన్నారు. అన్ని వైపులా నుంచి తీవ్ర స్థాయిలో వత్తిళ్లు పెరగడంతో టీఎన్జీవో నేతలు దిగి రాక తప్పలేదు. ఆర్టీసీ జేఏసీ నేతలతో టీఎన్జీవో నేతలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది అన్నారు. అయితే కార్మికులకు తాము మద్దతుగా ఉంటామని, ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ కోరారు. అంతకు ముందు టీఎన్జీవో నేతలు రవీందర్ రెడ్డి, మమతతో పాటు నాయకులు టీఎస్ సీఎస్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అయితే తమ తరపున పెద్దన్నగా కారెం రవీందర్ సీఎం తో మాట్లాడితే తమకు అభ్యంతరం లేదన్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయినా కేసీఆర్ మెట్టు దిగక పోగా, తెలంగాణ ఉద్యమంలో ఒక్క రోజు పాల్గొనని వారితో మాట్లాడించడం బాధ కలిగిస్తోందన్నారు. వీరెవ్వరికీ మాట్లాడే హక్కు లేదన్నారు అశ్వత్థామ.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి