ఓల్డ్ ఈజ్ గోల్డ్ - మార్కెట్లోకి బజాజ్ స్కూటర్

భారతీయ ఆటోమొబైల్స్ రంగంలో తనకంటూ ఓ బ్రాండ్ ను, ఇమేజ్ ను స్వంతం చేసుకుంది బజాజ్ కంపెనీది. హమారా బజాజ్ పేరుతో ఇండియా అంతటా విస్తరించింది. వాహనాల తయారీలో బజాజ్ కు ఎనలేని చరిత్ర ఉన్నది. కోట్లాది భారతీయుల్లో ఇప్పటికీ..ఎప్పటికీ మరిచి పోలేనిది ఏదైనా వెహికిల్ ఉందంటే అది ఒకే ఒక్కటి బజాజ్  స్కూటర్. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండడంతో కోట్లాది మంది బజాజ్ స్కూటర్ ను తమదానిగా భావించారు. ప్రత్యేకించి ఒక ఫ్యామిలీకి సరిపోయే లా దీనిని డిజైన్ చేశారు. మైలేజీ విషయంలోనూ, డిజైన్, కంఫర్ట్ గా ఉండడంతో ప్రతి ఒక్కరు దీనితో పాటే కొన్నేళ్లుగా ప్రయాణం చేస్తూ వచ్చారు. అయితే మిగతా కంపెనీల నుండి బైక్స్ కుప్పలు తెప్పలుగా మార్కెట్ ను ముంచెత్తాయి.

అయినా బజాజ్  స్కూటర్ మాత్రం చెక్కు చెదరలేదు. అంటే కంపెనీ ఎంతలా వాహనదారులతో కనెక్ట్ అయి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. బజాజ్ కంపెనీ వాహన తయారీలో, డిస్ట్రిబ్యూషన్ లో టాప్ టెన్ కంపెనీలలో ఇండియాలో ఒకటిగా నిలబడుతూ వస్తున్నది. తాజాగా కేవలం 60 నుంచి 70 వేల రూపాయల లోపు బుల్లి కారును కూడా లాంచ్ చేసింది. దీనికి జనం నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే  బజాజ్  స్కూటర్ 1976 నుంచి 2006 దాకా కొనసాగుతూ వచ్చింది. ఉన్నట్టుండి  బజాజ్  స్కూటర్ ను నిలిపి వేస్తున్నట్టు బజాజ్ కంపెనీ షాక్ ఇచ్చింది. ఈ ఒక్క డిసిషన్ తో కోట్లాది వాహన ప్రియులు బాధ పడ్డారు. ఎంతో సౌకర్యవంతంగా, అందుబాటు ధరల్లో ఉండడంతో పాటు ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లపై ఈజీగా వెళ్లేలా ఉండడంతో భారీగా కొనుగోలు చేశారు.

బజాజ్  స్కూటర్ తో పాటు బజాజ్ చేతక్, బజాజ్ ఆటో లు ఎక్కడ చూసినా అగుపిస్తూనే ఉంటాయి. బజాజ్ అంటే ఇండియా ..ఇండియా అంటేనే బజాజ్ అన్న రీతిలో పేరు పొందింది బజాజ్. అయితే ఇప్పటికీ  బజాజ్  స్కూటర్ ను నిలిపి వేసినా ఇంకా దానిని వాడుతున్న వారు ఎందరో. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా బజాజ్ కంపెనీ తాజాగా  బజాజ్  స్కూటర్ ను లాంచ్ చేసింది. అయితే పెట్రోల్, డీజిల్ తో కాదు జస్ట్ విద్యుత్ సహాయంతో నడిచేది. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పూణేలో బజాజ్  స్కూటర్ ను ప్రారంభించారు. దీంతో కోట్లాది భారతీయులకు ఇష్టమైన  బజాజ్  స్కూటర్ మళ్ళీ రాబోతోంది అన్నమాట. అయితే దీని ధర లక్షకు పైగా ఉంటుందనేది మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!