సౌందర్యకు దేశం సలాం
ఎవరీ సౌందర్య అనుకుంటున్నారా. తమిళనాడులోని విరుధూనగర్ లోని సేతు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఇప్పుడు దేశమంతటా వైరల్ గా మారింది. తన ప్రసంగంతో ఆకట్టుకుంది. దేశం యావత్తు ఈ అమ్మాయి ఎవరు..అంటూ గూగుల్ లో వెతుకుతోంది. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన స్టూడెంట్స్ కు దేశం బాగు పడాలంటే ఏం చేయాలి అనే అంశంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. పలు దిగ్గజ కంపెనీలకు చెందిన సీనియర్లు, మేనేజింగ్ డైరెక్టర్స్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొందరు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎంచుకుంటే, సౌందర్య మాత్రం దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగం పైనా, దీనిపైనే ఆధారపడిన రైతుల గురించి ప్రసంగించింది.
చదువు పూర్తి కాకా ముందే వీసా కోసం, అమెరికె వెళ్లి పోవాలని, డాలర్స్ కొల్లగొట్టాలని ఆలోచించే వారికి చెంప చెల్లు మనిపించేలా చేసింది సౌందర్య. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అమ్మాయి మాట్లాడిన మాటలు, చెప్పిన పదాలు, ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు సంచలనం కలిగించాయి. ఎంతో పరిణితితో, ఉదాహారణలతో, సమగ్ర సమాచారంతో అనర్గళంగా, ఎక్కడా తొట్రుపాటుకు గురి కాకుండా సౌందర్య చేసిన ప్రసంగం పలువురిని ఆలోచించేలా చేసింది. టెక్నాలజీని ఎలా వ్యవసాయానికి అనుసంధానం చేయవచ్చో చెప్పింది. ఆమె మాట్లాడుతూ ఉన్నంత సేపు సమావేశపు హాలు అంతా నిశ్శబ్డంతో నిండి పోయింది.
అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతలా ప్రభావితం చేసిందో. కాస్తంత టైమ్ దొరికితే చాలు పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్స్ లలో మునిగి తేలి పోయే విద్యార్థులు ఆలోచించుకునేలా చేసిన ప్రసంగానికి జనం ఫిదా అవుతున్నారు. దెబ్బకు యూట్యూబ్ లో సౌందర్య వైరల్ గా మారారు. తన ప్రసంగంలో తమిళనాడులో ప్రముఖ కవి తిరువళ్లూరు రాసిన కవితను ప్రస్తావించారు. చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు బొత్తిగా కవిత్వం అంటే పడదు. ఆమె ఈ దేశ భవిష్యత్తు గురించి చెప్పారు. పర్యావరణం, వ్యవసాయం ఎలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయో ఉదాహారణలతో చెప్పారు. అంతే కాదు దేశంలో ఒక అడవినే సృష్టించిన మహానుభావుడి కథ చెప్పారు.
అలాగే కలాం ఎలా ఎదిగారో, మనకు ఉండాల్సిన బాధ్యతల గురించి స్పష్టం చేశారు. అంతిమంగా అగ్రికల్చర్ అన్నది లేకపోతే ఈ దేశం చీకటి మయమై పోతుందని, ప్రపంచం అంటూ ఉండదని హెచ్చరించారు. డేటా బేస్డ్ ఇంజనీర్ గా పని చేస్తూనే దానిని వ్యవసాయానికి సమ్మిళితం చేయడమే తన ముందున్న లక్ష్యమని సౌందర్య తెలిపారు. మొత్తం మీద ఇలాంటి సౌందర్యలే మనకు కావాలి. ఈ దేశం, సమున్నత భారతం ఇలాంటి ఉక్కు సంకల్పం కలిగిన యువత కోసం వేచి చూస్తోంది. జాతి యావత్తు సౌందర్యకు సలాం చేస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి