గవర్నర్ అసాధారణ నిర్ణయం


మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి మరింత ఆజ్యం పోస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో, అన్ని ప్రధాన పార్టీలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. మరాఠాలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి సిఫారసు లేఖ రాశారు. దీంతో ఒక్కసారిగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ రూల్ విధించేందుకు సమ్మతి కూడా తెలిపినట్లు సమాచారం. దీనిపై శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే మండి పడ్డారు. అయితే తమకు ఇంకా కొన్ని గంటల సమయం ఉందని, ఈ సమయంలో ఏకపక్షంగా ఎలా గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని ఎన్సీపీ ఫైర్ అయ్యింది.

ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా గడువు మిగిలి ఉండగానే ఇలాంటి డిసిషన్ తీసుకోవడం పూర్తిగా రాజ్యంగా విరుద్ధమన్నారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే. ఈ మేరకు ఆయన ఇప్పటికే ఫోన్ లో కాంగ్రెస్ సీనియర్ లీడర్, అడ్వొకేట్ కపిల్ సిబల్, అహ్మద్ పటేల్ తో మాట్లాడారు. అంతకు ముందు అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. మరో వైపు కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు కలిసి పోటీ చేసాయి. ఈ సారి ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సీట్లు రాలేదు. ఇదిలా ఉండగా సీఎం పదవిలో మెట్టు దిగలేదు శివసేన. దీంతో బీజేపీతో ఉన్న స్నేహానికి బై చెప్పేసింది.

మరో వైపు ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్, ఎన్సీపీలతో ఉద్దవ్ ఠాక్రే సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో మాట్లాడారు. తమకు మద్దతు ఇవ్వమని కోరారు. మొదటగా సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్, చివరి నిమిషంలో ఝలక్ ఇచ్చింది. ఇదే సమయంలో మొదటగా అతి పెద్ద సంఖ్యా బలం కలిగిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు రమ్మని పిలిచారు గవర్నర్. రెండో పెద్ద పార్టీగా ఉన్న శివసేన, మూడో పెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని పిలిచారు. 48 గంటల సమయం ఇవ్వమని శివసేన కోరగా అందుకు గవర్నర్ ససేమిరా అన్నారు. మరో వైపు ఎన్సీపీ రాత్రి వరకు సమయం అడిగింది. ఇదే సమయంలో గవర్నర్ సిఫారసు లేఖ కలకలం రేపింది. తమకు కాకుండా ఏ పార్టీకి పవర్ వచ్చేలా చేయ కూడదని బీజేపీ ట్రై చేస్తోంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!