మన ఆటకు మంచి రోజులు


ఇప్పుడు ఆటలు అంటే ఎవ్వరికైనా గుర్తుకు వచ్చేది క్రికెట్ ఆటనే. కానీ భారత దేశానికి క్రీడా పరంగా ఘనమైన చరిత్ర ఉన్నది. అదేమిటంటే ఇప్పుడు ప్రపంచమంతటా మెస్మరైజ్ చేస్తోంది హాకీ ఆట. ఈ క్రీడ మనది. మన కంట్రీలో మొదటి సారిగా పుట్టింది. దీనికి ప్రాచుర్యం తీసుకు వచ్చింది మాత్రం ధ్యాన్ చంద్. ఆయన పేరు మీద ప్రభుత్వం అవార్డు కూడా ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా ఈ ఆటలో ప్రతిభ చూపిన ఆటగాళ్లను ఘనంగా సత్కరిస్తోంది. ఎప్పుడైతే క్రికెట్ ఆట లో మాజీ జట్టు సారధి, ఆల్ రౌండర్ కపిల్ దేవ్ 1983 లో ప్రపంచ కప్ ఇండియాకు తీసుకు వచ్చాడో, ఇక అప్పటి నుంచి దాని స్వరూపమే పూర్తిగా మారి పోయింది.

ఇప్పుడు 100  కోట్ల మందికి పైగా జనం  క్రికెట్ ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నారు. అది లేకుండా ఉండలేక పోతున్నారు. జాతీయ జెండాలు రెపరెపలాడేలా, కోట్లాది గుండెల్ని ఏకం చేసేలా చేస్తోంది క్రికెట్ క్రీడ. దీనిని తట్టుకుని మెలమెల్లగా మిగతా క్రీడలు కూడా వెలుగు చూస్తున్నాయి. టెన్నిస్, బ్యాడ్మింటన్, హాకీ, ఫుట్ బాల్, వాలీ బాల్, కబడ్డీ, చెస్, తదితర మరుగున పడిన ఆటలన్నీ మళ్ళీ జీవం పోసుకుంటున్నాయి. తాజాగా ఇండియన్ హాకీకి మంచి రోజులు వస్తున్నాయి. భారత పురుషుల, మహిళల హాకీ జట్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.

తొలి మ్యాచ్‌లో 5–1తో అమెరికాపై భారత మహిళల జట్టు విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో టీమిండియాకు 1–4తో ఓటమి ఎదురైంది. భారత్, అమెరికా చెరో మ్యాచ్‌లో నెగ్గడంతో, నిబంధనల ప్రకారం రెండు మ్యాచ్‌ల్లో సాధించిన మొత్తం గోల్స్‌ ఆధారంగా బెర్త్‌ ఎవరికి దక్కాలో నిర్ణయించారు. భారత్‌ 6–5 గోల్స్‌ తేడాతో అమెరికాపై పైచేయి సాధించి ‘టోక్యో’ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో రష్యాపై 4–2తో నెగ్గిన భారత పురుషుల జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. ఏకంగా 7–1 గోల్స్‌ తేడాతో రష్యాను చిత్తు చేసి ‘టోక్యో’ బెర్త్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మొత్తం గోల్స్‌లోనూ భారత్‌దే 11–3తో పైచేయిగా నిలిచింది.

తొలి  మ్యాచ్‌లో అమెరికాను వణికించిన భారత మహిళల జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం తడబడింది. కనీసం నాలుగు గోల్స్‌ తేడాతో గెలిస్తేనే ‘టోక్యో’ బెర్త్‌ ఆశలు సజీవంగా ఉన్న పరిస్థితుల్లో అమెరికా ఆరంభం నుంచే ఎదురు దాడులు చేసింది. వారి దూకుడు ఫలితాన్నిచ్చింది. మొత్తం గోల్స్‌ సంఖ్య 5–5తో సమ ఉజ్జీగా ఉంది .ఇదే సమయంలో భారత కెప్టెన్‌ రాణి రాంపాల్‌ ఛాన్స్ వదులు కోలేదు. కళ్లు చెదిరే షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చిన రాణి రాంపాల్‌ భారత్‌ ఖాతాలో గోల్‌ చేర్చింది. దీంతో మొత్తం గోల్స్‌ సంఖ్యలో భారత్‌ 6–5తో ఆధిక్యంలోకి వచ్చింది. ఇండియా మ్యాచ్‌లో ఓడిపోయినా ‘టోక్యో’ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!