ధిక్కార పతాకం..సర్దారా సంచలనం

ఈ దేశం ఒక్కసారిగా అతడి వైపు చూస్తోంది. ఎందుకంటే ఆయన ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నా, సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నా..ప్రజల కోసం ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను ఆయన టార్గెట్ చేశారు. సేవ చేసే వాళ్లకు పెన్షన్స్ ఎందుకంటూ భారత దేశ అత్యున్నత ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంతగా వైరల్ అవుతున్న ఆయనెవరో కాదు దేశం గర్వించదగిన ఆర్థికవేత్తలలో, మేధావుల్లో ఒకడు. అతడే సర్దారా సింగ్ జోహ్. అగ్రికల్చర్ ఎకానమిస్ట్ గా, పూర్వ ఉప కులపతిగా ఆయన పని చేశారు. అత్యున్నతమైన అవార్డులు అందుకున్నారు.

ఇన్ని వున్నా ఆయన మాత్రం సమస్యలపై నిరంతరం నిలదీస్తూ వస్తున్నారు. రచయితగా, పొలిటికల్ లీడర్ గా, ఎకానమిస్ట్ గా, సామాజికవేత్తగా ఇప్పటికే ప్రభుత్వాలను గడగడ లాడిస్తున్నారు సింగ్. పంజాబ్ యూనివర్సిటీ కి వీసీగా పని చేశారు. తాజాగా ఆయన జనం ఎన్నుకున్న ఎంపీలకు పెన్షన్స్ ఎందుకు ఇస్తున్నారని, వెంటనే ప్రభుత్వం నిలిపి వేయాలని కోరుతూ కోర్టులు పిటిషన్ దాఖలు చేశారు. 2018 అభివృద్ధి చట్టం ప్రకారం ఎంపీలు పెన్షన్ పొంద కూడని పిటిషన్ లో పేర్కొన్నారు. రాజకీయాలు అంటే ఉపాధి కాదు, ఉద్యోగం కాదు అది ఒక రకంగా సేవ మాత్రమే. ఒక వ్యక్తి కౌన్సిలర్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుస్తాడు. ఒకటి కాదు ఏకంగా మూడు పెన్షన్లు పొందుతాడు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం.

దీని వల్ల ప్రజా దానం వృధా అవుతుంది. దీనిని ఆపేందుకు వెంటనే చట్టం చేయాలని సింగ్ కోరారు. కేంద్ర వేతనంతో ఎంపీల జీత భత్యాలు సవరిస్తున్నారు. దీనిని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకు రావాలి. వీరేదో ఉద్ధరిస్తారని అనుకుంటే అన్ని సౌకర్యాలు పొందుతూ జనాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వారి వైద్య ఖర్చులు కూడా జనం డబ్బులతోనే గుంజుతున్నారు. నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సబ్సిడీలు కట్ చేయాలి. ఉచిత రైలు, విమాన ప్రయాణం రద్దు చేయాలి అని సర్దారా సింగ్ జోహ్ డిమాండ్ చేశారు. మొత్తం మీద ఈ ఆర్థికవేత్త చేస్తున్న ప్రయత్నానికి మనమూ మద్దతు తెలుపుదాం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!