రేసులో ఇద్దరే..గెలిచేది ఒక్కరే


బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ వంద రోజులకు పైగా సాగింది. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో రికార్డులను తిరగ రాస్తూ విజృంభించినప్పటికీ అదే దూకుడును షో ఆసాంతం కొనసాగించ లేక పోయింది. బిగ్‌బాస్‌ అప్పుడప్పుడు ఇచ్చిన ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు, రాహుల్‌, పునర్నవిల రిలేషన్‌షిప్‌ షోను గట్టెక్కించాయి. జర్నీలో ఇంటి సభ్యులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మరెన్నో మధురాను భూతులను మిగుల్చుకున్నారు. ఉన్న స్నేహితులు మరింత క్లోజ్‌ అయ్యారు. ఒకరినొకరు తెలుసుకున్నారు. ఇక బిగ్‌బాస్‌ అంతిమ ఘట్టానికి చేరుకుంది.

అందరినీ దాటుకుంటూ, ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటూ అయిదుగురు టాప్‌ 5లోకి అడుగు పెట్టారు. ఓట్లు వేయడానికి డెడ్‌ లైన్‌ ముగియడంతో తీర్పు ఈపాటికే ఖరారై పోయిందని, విన్నర్‌ ఎవరో తేలి పోయిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓటింగ్‌లో దుమ్ము లేపిన రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి ఇంచుమించు సమానంగా ఉన్నప్పటికీ చివరలో వచ్చే సరికి మాత్రం రాహుల్‌కు విపరీతంగా ఓట్లు పోలయ్యాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

విచిత్రంగా నామినేషన్లోకి వెళ్లిన ప్రతిసారీ రాహుల్‌దే పైచేయి అవుతూ వచ్చింది. దీంతో ఇంటి సభ్యులకు రాహుల్‌కు ఉన్న ఫాలోయింగ్‌ అర్థమైంది. పున్ను ఎలిమినేట్‌ అయ్యాక రాహుల్‌ పూర్తిగా ఆట పైనే దృష్టి పెట్టాడు. గత సీజన్‌లో విజేతగా నిలిచిన కౌశల్‌ కూడా 11 సార్లు నామినేట్‌ అవడం విశేషం. మొన్నటి వరకు టైటిల్‌ ఫేవరెట్‌గా ఉన్న శ్రీముఖి రాహుల్ తో టఫ్ ఫైట్ ఇస్తూ వచ్చింది. ఫలితాలను తారు మారు చేసే అవకాశాలు లేక పోలేదు. బిగ్‌బాస్‌ విజేత ఎవరో తెలుసు కోవాలంటే వేచి చూడాల్సిందే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!