అభిమానులకు పవన్ చిత్ర కానుక
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు మిస్టర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు అందించారు. ఇప్పటికే అయన పార్టీ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నారు. అటు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలంగాణాలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టారు. అంతే కాకుండా దేనినీ వదిలి పెట్టడం లేదు ఈ జనసేనాని. భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణాలో తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం గత 29 రోజులుగా చేస్తున్న సమ్మెకు, ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్తమ రెడ్డి, రాజి రెడ్డి, తదితరులు పవర్ స్టార్ ను కలిశారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఇందుకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బేషరతుగా కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తాను సీఎం ను కలుస్తానని చెప్పారు. కార్మికులకు వేతనాలు చెల్లించక పోవడం దారుణమని అన్నారు. ఇదిలా ఉండగా, తాజాగా పవన్ కళ్యాణ్ తన అభిమానులకు పండుగ లాంటి వార్త ప్రకటించారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడి అయ్యింది. బాలీవుడ్ చిత్రం `పింక్`ను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ చేసిన లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటించనున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. `ఓ మై ఫ్రెండ్`, `ఎంసీఏ` చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమాను డైరెక్ట్ చేయన్నారు. 2018లో విడుదలైన `అజ్ఞాతవాసి` తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించ లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ పవన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం ఆయన ఫ్యాన్స్ కు శుభవార్తే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి