మతులు పోగొడుతున్న అందం
కియారా అద్వానీ తెలుసుగా. ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి భరత్ అనే నేను సినిమాలో నటించింది..మెప్పించింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. అయితే ఆ సినిమా కియారా కెరీర్‌కి కలసి రాలేదు. ఆ దెబ్బతో తనకి కలిసొచ్చిన బీటౌన్‌కి వెళ్లి అక్కడ బిజీ అయింది. ఇక రీసెంట్‌గా వంగా అనుదీప్ రెడ్డి తీసిన 'కబీర్ సింగ్'తో సంచలన విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఈ సుందరాంగి తన సొగసులకి మెరుగులు దిద్దే పనిలో పడింది. అందులో భాగంగానే బాక్సింగ్ పంచెస్ విసురుతూ కుర్రాళ్ళకి మతులు పోగొడుతోంది ఈ లస్ట్ హాటీ.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కియారా సీరియస్‌గానే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో ఈ హాట్ బ్యూటీ బాక్సింగ్ గ్లవ్స్ ధరించి ఎదురుగా ఉన్న ట్రైనర్ పైనా పంచులతో విరుచుకు పడుతోంది. చేతులతోనే కాక, కాళ్ళతో కూడా కిక్ ఇవ్వడానికి తెగ ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఈ అందాలగుమ్మ పంచుల వర్షం కురిపిస్తూ ఉంటే పాపం ఆ ట్రైనర్ చేతులను అడ్డం పెడుతూ వెనుకకు జరుగుతూ కనిపిస్తున్నాడు. ఇక బాక్సింగ్ ప్రాక్టీస్‌లో కూడా కియారా అందాల విందు చేయడం మరచి పోలేదు.
ఈ వీడియోలో టైట్ టాప్ ధరించి నడుము అందాలను అలా వదిలేసి కనిపిస్తుండటం విశేషం. ఏదేమైనా బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోంది కియారా. శరీరాకృతి విషయంలో ఈమె ఇంతలా శ్రద్ద చూపించడం మంచి విషయమే. ప్రస్తుతం కియారా గుడ్ న్యూస్, లక్ష్మి బాంబ్ , ఇందు కీ జవానీ చిత్రాలలో నటిస్తోంది. మరి ఈ చిత్రాల ద్వారా ఈ అమ్మడు టాప్ హీరోయిన్ స్టేటస్‌ని అందు కుంటుందో లేదో చూడాలి. కియారా అందాలు చూడాలంటే కొంత కాలం ఆగాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి