విలీనం చేయం..ప్రైవేట్ పరం చేస్తం


అనుకున్నదే జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై కీలక ప్రకటన చేశారు. కార్మికులకు సీఎం డెడ్ లైన్ విధించారు. ఇచ్చిన గడువు లోపు చేరక పోతే ఇక ఇంటికే అని చెప్పారు. లేకపోతే వారికి ఫ్యూచర్ ఉండదన్నారు. కేంద్రం ఆమోదించిన మోటార్ వెహికిల్ చట్టం ప్రకారంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బీజేపీపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5100 రూట్లను ప్రైవేట్ పరం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీతో పాటు ఇతర అంశాలపై కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో 49 అంశాలపై చర్చ జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో విలీనం చేయ కూడదని కేబినెట్‌ నిర్ణయించినట్లు కేసీఆర్ వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేశామని చెప్పారు. ఎక్సైజ్ పాలసీతో 975 కోట్ల ఆదాయం కలిసి వచ్చిందని తెలిపారు. అంతులేని కోరికలతో ఆర్టీసి కార్మికులు సమ్మెకు వెళ్లారని విమర్శించారు. ఆర్టీసీలో మొత్తం 10,400 బస్సులు ఉన్నాయని, వాటిలో 8300 బస్సులు ఆర్టీసీ బస్సులు, 2100 అద్దె బస్సులు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో 2300 మూలకు పడ్డాయని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల కార్యాచరణ అర్ధరహితమైనది. ప్లాట్ ఫామ్ స్పీచ్ వేరు రియాలిటీ వేరు. కార్మికులు రోడ్డున పడే అవకాశముంది. బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి రావొద్దు. చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ లేదు. వెస్ట్ బెంగాల్లో బెస్ట్ పద్ధతి ఉంది. ఆర్టీసీ ఉండాలి ప్రైవేటు బస్సులు ఉండాలి. ఆరోగ్య కరమైన పోటీ ఉండాలని నిర్ణయించాం.

కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం నిర్ణయం తీసుకున్నాం. కార్మికుల ఎడల కఠినంగా లేము. 67 శాతం వేతనాలు పెంచాం. 4260 మందిని రెగ్యులరైజ్ చేశాం. కార్మికుల కడుపు నింపినం. ఎవరి పొట్ట కొట్టలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు గౌరవ ప్రదంగా గడపాలని కోరుకుంటుంది. చేనేత కార్మికుల ఆత్మహత్యలు నివారించాం. ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలే. యూనియన్ల మాయ లో పడి రోడ్డున పడొద్దు. ఆర్టీసీ కార్మికులకు మరో అవకాశం ఇస్తున్నం అని చెప్పారు. కార్మికులకు చని పోయేందుకు కారకులు విపక్షాలేనని ఆరోపించారు. మొత్తంగా తాను అనుకున్నట్టు నిర్ణయం చెప్పేశారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!