ఐటీ శాఖ నోటీసులు ప్రజాప్రతినిధుల్లో గుబులు
ఓ వైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు నానా అవస్థలు పడుతుంటే మరో వైపు గులాబీ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఒక్కసారిగా ఆస్తులు పెరిగాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న వివరాలు..ఇపుడు జరిగిన ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లలో పొందుపర్చిన వివరాల గురించి ఐటీ శాఖ ఆరా తీయడం మొదలు పెట్టింది. దీంతో ఆయా ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్ గడ్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్ట్రాలలో గెలిచిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన దాఖలు అగుపించలేదు. ప్రస్తుతం టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆస్తులు, అప్పుల లెక్కలను సరి చూసుకునే పనిలో పడ్డారు. ప్రజాప్రతినిధులు నామినేషన్లు వేసే సమయంలో ఆస్తులకు ..అప్పులకు సంబంధించి పూర్తి వివరాలు నమోదు చేస్తారు. వాటి ఆధారాంగానే ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడమో లేక చర్యలు తీసుకోవడమో జరుగుతుంది.
2018 - 2019 సంవత్సరానికి సంబంధించి జరిపిన లావాదేవీలు ..సమర్పించిన వివరాలపైనే ఎక్కువగా ఐటీ శాఖ నజర్ పెట్టినట్టు సమాచారం. 2014 నుండి 2018 వరకు చూస్తే ఆస్తుల్లో భారీ తేడాలున్నట్లు గుర్తించారు. వారిలో ఒక్కో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల జాబితా చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. వివరాలలోకి వెళితే..ఇలా ఉ్నాయి. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు 2014లో 48.51 లక్షలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంటే..2018 వరకు వచ్చే సరికల్లా 6 కోట్ల 86 లక్షలుగా పేర్కొన్నారు. ఆదిలాబాద్ కు చెందిన జోగు రామన్న 2014లో 84.86 లక్షలు ఉన్నట్లు తెలిపితే 2018లో 3 కోట్ల 78 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంకు సంబంధించి గొంగడి సునీతకు సంబంధించి 1.90 కోట్లు ఉండగా ..2018లో 4 కోట్ల 85 లక్షలు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. బాన్సువాడకు సంబంధించి పోచారం శ్రీనివాస్ రెడ్డి 2014లో 48.17 లక్షలు పేర్కొనగా..2018లో 4.94 కోట్లు ఉన్నాయని తెలిపారు. బోధన్ నియోజకవర్గానికి వస్తే..2014లో షకీల్‌కు 1.34 కోట్లుండగా..2018లో 18.91 కోట్లకు పెరిగింది. ధర్మపురి నియోజకవర్గంలో చూస్తే..కొప్పుల ఈశ్వర్ కు 2014లో 57.10 లక్షలు ఉండగా ..2018లో 2.77 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కేసీఆర్ 2014లో 15.16 కోట్లు ఉన్నట్లు పేర్కొంటే..2018లో 23.55 కోట్లు పెరిగినట్లు అఫిడవిట్‌లో తెలిపారు. హుస్నాబాద్ అసెంబ్లీ వరకు చూస్తే..సతీష్ కుమార్ 2014లో 2.19 కోట్లు ఉండగా ..2018లో 5.35 కోట్లు పెరిగినట్లు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈటెల రాజేందర్ 2014 లో 14.51 కోట్లు ఉన్నట్లు పేర్కొనగా.. 2018లో 42.41 కోట్లు పెరిగింది. దీనిపై ఐటీ శాఖ నజర్ పెట్టింది. జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరంగా చూస్తే లక్ష్మారెడ్డి 2014లో 4.87 కోట్లు ఉండగా 2018 వరకు వచ్చేసరికల్లా 17.29 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో చూస్తే గంగుల కమలాకర్ 2014లో 14.79 కోట్లు ఉంటే..29.36 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఖానాపూర్ అసెంబ్లీకి సంబంధించి ఆజ్మీరా రేఖకు 2014లో 2.69 కోట్లుంటే..2018లో 6.02 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి విద్యా సాగర్ రావుకు 2014లో 1.70 కోట్లు ఉండగా 2018లో 6.38 కోట్లకు పెరిగింది. మహబూబాబాద్ అసెంబ్లీకి వస్తే .. శంకర్ నాయక్ కు 2014లో 4.02 కోట్లు ఉండగా ..2018లో 8.08 కోట్లుగా ఉంది. మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి వస్తే శ్రీనివాస్ గౌడ్‌కు 2014లో 3.93 కోట్లు ఉండగా ..2018లో 10.61 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మక్తల్‌కు సంబంధించి రామ్మోహన్ రెడ్డికి 2014లో 10.97 కోట్లు ఉండగా ..2018లో 18.12 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే..మర్రి జనార్దన్ రెడ్డికి 2014లో 111 కోట్లు ఉండగా 2018లో 161.29 కోట్లు ఉన్నట్లు తెలిపారు. పాలకుర్తి అసెంబ్లీకి సంంధించి దయాకర్ రావుకు 2014లో 2.47 కోట్లు ఉండగా ..2018లో 8.12 కోట్లు ఉన్నట్లు తెలిపారు. పరకాల అసెంబ్లీకి సంబంధించి ధర్మారెడ్డి 2014లో 12.70 కోట్లుంటే..2018లో 32.61 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పటాన్ చెరువు అసెంబ్లీకి సంబంధించి మహిపాల్ రెడ్డికి 2014లో 7.87 కోట్లుంటే..2018 లో 22.05 కోట్లున్నట్లు పేర్కొన్నారు.
సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన హరీష్ రావు 2014లో 2.96 కోట్లు ఉండగా ..2018లో 11.48 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో చూస్తే కేటీఆర్ 2014లో 7.98 కోట్లు ఉండగా 2018లో 41.83 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. సూర్యాపేట అసెంబ్లీకి సంబంధించి జగదీశ్వర్ రెడ్డికి 2014లో 1.19 కోట్లు ఉండగా 2018లో 3.71 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కిషోర్ కు 1.82 లక్షలు ఉంటే..2018లో 1.06 కోట్లు ఉన్నట్లు తెలిపారు. వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి 31.09 కోట్లుండగా ..2018 లో 3.61 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక వర్దన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం చూస్తే..రమేష్ 2014లో 14.94 కోట్లు ఉండగా..2018లో 29.34 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం మీద రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు కలిగిన వ్యక్తులుగా..అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రికార్డు సృష్టించారు. వామ్మో ఇన్ని కోట్లు ఎలా సంపాదించారన్నదే అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి