ఆర్ధిక మాంద్యం..సినిమాకు వరం
కేంద్రంలో బిజేపీ ప్రభుత్వం కొలువు తీరాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దు దెబ్బకు వ్యాపార వర్గాలు అబ్బా అంటున్నాయి. దేశ ఆర్ధిక పరిస్థితులు పతనం దిశగా సాగుతున్నాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్ధేందుకు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్దీపన చర్యలు చేపట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వం తరపు నుండి సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం ప్రభావం అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. అయితే విచిత్ర కరంగా సినిమా పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపక పోవడం విస్తుపోయేలా చేస్తోంది. దీని ఎఫక్ట్ ఈ రంగంపై చూపక పోవడంతో సినిమాలు యధావిధిగా విడుదలవుతున్నాయి. మిగతా ప్రాధ్యాన్య రంగాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నా వినోద రంగం మాత్రం అంతకంతకు ఆదాయాన్ని గడిస్తోంది.
డిజిటల్ టెక్నాలజీ లో పెను మార్పులు చోటు చేసుకోవడం కూడా కొంత మేరకు డబ్బులు వచ్చేలా చేస్తున్నాయి. ఒక్క సినిమా రంగాన్ని నమ్ముకుని ఆధార పడుతున్న కుటుంబాలు వేలాదిగా ఉన్నాయి. ఒక్క సినిమా స్టార్ట్ అవుతే కనీసం నాలుగు నెలల నుండి ఆరు నెలల దాకా సమయం పడుతుంది. సినిమా ప్రారంభం నుంచి విడుదల అయ్యేంత దాకా విపరీతమైన టెన్షన్ వాతావరణం నెలకొని ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికినీ సినిమాలను చూడకుండా ఉండలేక పోతున్నారు జనం. దీంతో పాత తరం కొంచం వెనక్కు తగ్గినా కొత్త తరం మాత్రం తమ ఐడియాస్ ను వర్క్ అవుట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా క్రియేటివిటీకి పదును పెడుతూ దుమ్ము రేపుతున్నారు. తెలుగు సినిమా ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది.
ఇదిలా ఉండగా ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే సినిమాలు చూడమని సెలవిస్తున్నారు ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ దిగ్గజం పీవీఆర్ సినిమాస్ సీఈవో జ్ఞాన్ చందాని. సినిమాలు అధికంగా చూస్తే.. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని చెబుతున్నారు. దేశమంతటా ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి భయపడుతున్నారని, కానీ సినీ పరిశ్రమకు మాత్రం వరంగా మారిందని అంటున్నారు. ఆర్థిక మాంద్యం వల్ల మేమైతే సంతోషంగా ఉన్నాం.. వ్యాపారం బాగుంది.. సమస్యలైతే ఏమీ లేవు అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో తమ సంస్థకు గణనీయమైన లాభాలు వచ్చాయని వెల్లడించారు. చైనాకు చెందిన వాండా ఫిల్మ్ హోల్డింగ్ కంపెనీతో పోల్చుకుంటే.. పీవీఆర్ 43 రెట్లకు పైగా ఆదాయాన్ని పొందిందని వెల్లడించారు.
క్రికెట్ వరల్డ్ కప్ ఉన్న సమయంలోనూ తమ కంపెనీ 20 శాతం లాభాలు పొందిందని తెలిపారు. కాగా రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చాక..ఇంటర్నెట్ స్వరూపమే పూర్తిగా మారి పోయింది. తక్కువ మొత్తంలో ఎక్కువ డాటా పొందే అవకాశం ఉండటంతో.. కోట్లాది మంది ప్రజలు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లలో సినిమాలు చూస్తూ వినోదం పొందుతున్నారు. దీంతో థియేటర్ ఎందుకు దండగ అనే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పీవీఆర్ సినిమా వ్యాపారం మాత్రం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుండటం సినిమాయే వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎంతైనా అందరూ నడిచే దారుల్లో నడిస్తే ఏం లాభం. డిఫరెంట్ గా ఆలోచించి, అడుగులు వేస్తే సక్సెస్ దానంతట అదే వస్తుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి