కార్మికుల కోసం..అఖిలపక్షం
ప్రభుత్వం దిగి రావడం లేదు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తమ సంస్థను ప్రభుత్వపరం చేయాలని కోరుతున్నారు. నష్టాల పేరుతో ఆర్టీసీని బడా బాబులకు కట్టబెట్టేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నాడని, ఎట్టి పరిస్థితుల్లో తాము ఆందోళనను విరమించే ప్రసక్తి లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డిలు స్పష్టం చేశారు. అమరులకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన నేతలను అరెస్ట్ చేసి, విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఎంతకూ దిగి రాక పోవడంతో జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది. న్యాయపరంగా, శాంతియుతంగా తమ నిరసన కొనసాగుతుందని అన్నారు. విపక్షాలు, ప్రజా సంఘాలు, ఇతర ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. 50000 వేల మందికి పైగా కార్మికులు విధులు బహిష్కరించారు.
సమ్మెకు దిగి ఆరు రోజులు కావొస్తోంది. అయినా సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాక పోగా, 30 శాతం ప్రైవేట్ పరం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఎవరైతే డెడ్ లైన్ లోపు విధులకు హాజరు కాకపోతే వారంతా మాజీ ఉద్యోగులవుతారని సీఎం చెప్పారు. కొత్తగా నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయా డిపోల వద్ద పోలీసులతో బస్సులు నడిపేలా చేస్తున్నారు. తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లు, కండక్టర్లను నియమిస్తూనే, బస్సులు నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. అఖిలపక్షం పూర్తిగా బేషరత్హుగా మద్దతు కొనసాగుతుందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, జనసేన, టీడీపీ, బీఎస్పీ, తదితర పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నాయి. ఇదే సమయంలో హుజూర్ నగర్ ఎన్నికల్లో తాము మద్దతు ఇచ్చే విషయంపై పునరాలోచిస్తామని సీపీఐ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. సమ్మెతో పాటు తెలంగాణ బంద్ కు పిలుపు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నది ఆర్టీసీ జేఏసీ. ఈరోజు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నష్టాల పేరుతో ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకు వస్తోంది. దాదాపు 50 శాతం ప్రైవేట్ బస్సులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. ఈరోజు వరకు రవాణా శాఖా మంత్రి బయటకు రాలేదు. సమస్య తీవ్రతరం కావడంతో రాష్ట్ర గవర్నర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి