ఇమ్రాన్ ఖాన్ కు యువరాజు ఝలక్
దాయాది పాకిస్తాన్ కు ప్రతి చోటా వ్యతిరేకత ఎదురవుతోంది. ఎక్కడికి వెళ్లినా ఏ ఒక్క దేశం సపోర్ట్ చేయడం లేదు. ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇండియాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నా, విషం కక్కుతున్నా వర్కవుట్ కావడం లేదు. ఒక్క చైనా కంట్రీ తప్పా ఏ ఒక్క దేశమూ పాకిస్తాన్ వైపు రావడం లేదు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ కు ఘోర అవమానం చోటు చేసుకోవడం వైరల్ గా మారింది. చిరకాల స్నేహితుడివని నీకు స్పెషల్ గా విమానం ఇచ్చి మరీ సాగనంపితే ..ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో నన్నే అవమానిస్తావా..నన్ను కాదని మహతీర్ అహ్మద్ , ఎర్డోగాన్ తో కలిసి ఇస్లామిక్ దేశాల వాదన వినిపించాలని డిసైడ్ అవుతావా..దోస్తువని నీకు గౌరవం ఇస్తే ఇలాగేనా ప్రవర్తించేది అంటూ సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మండిపడ్డారు.
తాజాగా ఇమ్రాన్ ఖాన్ తిరిగొస్తున్న విమానం సాంకేతిక సమస్యతో ఆగి పోవడం, తర్వాతి రోజు ఇమ్రాన్ కమర్షియల్ ఫ్లైట్‌లో ఇస్లామాబాద్చే చేరుకున్నారు. ఆ ఫ్లైట్‌లో ఎలాంటి ప్రాబ్లం లేదని, సౌదీ యువరాజు ఆదేశాలతోనే ఫ్లైట్ ను ఆపేసినట్లు పాకిస్తానీ పత్రిక ‘ది ఫ్రైడే టైమ్స్’ వివరించింది. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారమని పాక్ ప్రభుత్వం ఖండించింది. సౌదీతో పాకిస్తాన్‌కు సోదర సంబంధాలు ఉన్నాయని, ఇక పైనా కొనసాగుతాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. కాగా న్యూయార్క్‌లో జరిగిన యూఎన్ సమావేశాలకు ముందు ఇమ్రాన్ ఖాన్ సౌదీలో రెండు రోజులు పర్యటించారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ పాక్ ప్రధానిని సాదరంగా ఆహ్వానించి, మర్యాదలు చేశారు.
చర్చల తర్వాత న్యూయార్క్ వెళ్లేందుకు తన స్పెషల్ ఫ్లైటిచ్చి పంపారు. యూఎన్ సమావేశాల్లో ఇమ్రాన్ ఖాన్ టర్కీ ప్రెసిడెంట్ తయ్యిబ్ ఎర్డోగాన్, మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్‌తో కలిసి ముస్లిం దేశాల వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. తర్వాత ఇరాన్ అధికార ప్రతినిధితో చర్చలకు సిద్ధపడ్డారు. సమావేశాలు ముగిసాక సెప్టెంబర్ 28న సౌదీ యువరాజు ఇచ్చిన ఫ్లైట్‌లో ఇస్లామాబాద్‌కు బయల్దేరారు. ప్రయాణం ప్రారంభించిన కాసేపటికే టెక్నికల్ ప్రాబ్లం పేరుతో ఫ్లైట్ వెనక్కొచ్చి న్యూయార్క్‌లో దిగింది. ఆ మరుసటి రోజు కమర్షియల్ ఫ్లైట్‌లో ఇమ్రాన్ పాక్ చేరుకున్నారు. మొత్తం మీద బీరాలు పలుకుతున్న ఇమ్రాన్ ఖాన్ కు ఈ రకంగా సౌదీ అరేబియా రాజు అనుకోని రీతిలో ఝలక్ ఇచ్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి