సై అంటున్న కార్మికులు..డోంట్ కేర్ అంటున్న కేసీఆర్
ఘనమైన చరిత్రను స్వంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు రోడ్డున పడింది. వేలాది మంది కార్మికుల కుటుంబాలు అన్నమో రామచంద్ర అంటున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. నష్టాల పేరుతో కోట్లాది ప్రజలకు రేయింబవళ్లు సేవలు అందిస్తున్న ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డిలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే తమ సంస్థకు 50 వేల కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయని, అయితే సీఎం చెబుతున్నట్లు తమ ఆర్టీసీ నష్టాల్లో ఉందనడం అబద్ధమన్నారు. తాను తలుచుకుంటే 2800 కోట్లు మంజూరు చేయడం పెద్ద విషయం కాదన్నారు.
ఆస్తులపై కన్నేసి తమను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బందులకు గురి చేసేలా చేస్తున్నారంటూ మండి పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి జీతాలు తీసుకోకుండానే సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. పోరాటంలో అగ్రభాగాన నిలిచారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ బతుకులు బాగు పడుతాయని కార్మికులు భావిస్తున్నారు. అయినా సర్కార్ నోరు మెదపడం లేదు. గన్ పార్కు వద్ద అమర వీరులకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. కార్మికులు, విపక్షాలు, మేధావులు, విద్యార్ధి సంఘాల నుండి తీవ్ర వత్తిళ్లు రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నేతలను విడుదల చేశారు. సీఎం నిరంకుశ వైఖరిని విడనాడాలని అశ్వత్థామ, రాజి రెడ్డిలు కోరారు.
అరెస్టులు, కేసులు, జైళ్లకు వెళ్లడం తమకు కొత్తేమి కాదన్నారు. 99 శాతం కార్మికులు, సిబ్బంది ఏ ఒక్కరు విధుల్లో చేరలేదన్నారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సరే తమ సమ్మెను మాత్రం ఆప్ ప్రశక్తే లేదంటున్నారు. అఖిలపక్షం తో సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఈ మేరకు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత కోదండరామి రెడ్డి, బిజెపి, సీపీఐ , సీపీఎం , టీడీపీ, ప్రజా సంఘాలు, విద్యార్ధి, మహిళా సంఘాలు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఏపీలో నష్టాలకు గురైనప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వపరం చేశారని, కానీ తెలంగాణాలో ప్రభుత్వం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందని నాయకులు మండి పడుతున్నారు. మొత్తం మీద నువ్వా నేనా అన్న రీతిలో సమస్య నెలకొని ఉన్నది. తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ ను కలవాలని నిర్ణయం తీసుకున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి