సినీవాలిలో తమన్వయత్వం
నటుడిగా ప్రారంభమై సంగీత దర్శకుడిగా టాప్ రేంజ్ లో కొనసాగుతున్న ఎస్.ఎస్.థమన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాణీలను కాపీ కొడుతున్నారంటూ ఆరోపణలు వచ్చినా వాటిని బేఖాతర్ చేస్తూ తనను తాను ఉత్తమ సంగీత దర్శకుడిగా నిరూపించుకున్నాడు. ఇప్పటికే తెలుగు సినీ రంగంలో ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిని కాదనుకుని నిలబడాలంటే దమ్ముండాలి. డిఫరెంట్ గా జనం పల్స్ ను పట్టుకోవాలి. అప్పుడే సక్సెస్ వెంటపడుతుంది. దీని కోసం థమన్ బాగా కష్టపడడ్డాడు. ప్రస్తుతం దుమ్ము రేపుతున్న అందరు నటులకు మ్యూజిక్ ఇచ్చేలా ఎదిగాడు. ఎస్.ఎస్. తమన్ పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. ప్రస్తుతం థమన్ కు 35 ఏళ్ళు.1983 నవంబరు 16 లో పుట్టాడు. నటుడే కాకుండా స్వరకర్త, రికార్డు నిర్మాత, సంగీత దర్శకుడు, గాయకుడు కూడా.
2003 నుంచి తన కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఎన్నో జింగిల్స్ చేశాడు. ఏఆర్ రెహమాన్ దగ్గర కొంత కాలం పనిచేశాడు. . ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇతడి మొదటి చిత్రం తెలుగులో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన, మాస్ మహారాజ, ఇలియానా కలిసి నటించిన కిక్ సినిమా. అది బిగ్ హిట్ గా నిలిచింది. పాటలు, మ్యూజిక్ పరంగా సక్సెస్ అయ్యింది. అంతకు ముందు బాయ్స్ చిత్రంలో థమన్ సైడ్ యాక్టర్ గా ఒక పాత్రలో నటించాడు. సౌత్ ఇండియా లో మంచి పేరుంది ఇతడికి. అక్కినేని నాగేశ్వరరావు పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన “సీతారామ జననం” సినిమాను తెర కెక్కించిన గతకాలపు దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. తమన్ పొట్టేపాళెం, నెల్లూరు జిల్లా సంగీతకారుల కుటుంబానికి చెందిన వాడు. ఇతని తండ్రి ఘంటసాల శివ కుమార్. అతను స్వరకర్త కె. చక్రవర్తి కింద 700 సినిమాల్లో పని చేసిన ఒక డ్రమ్మర్.
తన తల్లి ఘంటసాల సావిత్రి నేపథ్య గాయని. తన అత్త పి. వసంత కూడా గాయనీమణి. తమన్ నేపథ్య గాయని శ్రీవర్ధినిని వివాహం చేసుకున్నాడు. భీభత్సం, మళ్ళీ మళ్ళీ, తిల్లాలన్గడి , మోస్కోవిన్ కావేరీ ,ఆంజనేయులు , షేర్ దిల్ , ఈరం వైశాలి , శంఖం శివప్పుసామి , ఫిర్ ఏక్ మోస్ట్ వాంటెడ్, జయీభవ , పద్మవ్యూహం, నాణ్యం, మరో చరిత్ర, ముంధీనం పార్థేనే, అరిదు అరిదు, కదలాగి, వస్తాద్అయ్యనార్, నగరం, మిరపకాయ్ , మురట్టు ఇలా చాలా సినిమాలకు సంగీతం అందించారు థమన్. జూనియర్ ఎన్ఠీఆర్ నటించిన అరవింద సమేత పెద్ద హిట్. తాజాగా త్రివిక్రం తీస్తున్న అల వైకుంఠపురంలో సినిమాకు కూడా మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి సిరివెన్నెల రాయగా సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ యూట్యూబ్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. తెలుగు, తమిళ్ ,హిందీ సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్న థమన్ రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలకు మ్యూజిక్ ఇవ్వాలని ఆశిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి