దిల్ ఉన్నోడు..మనోడు ..దమ్మున్నోడు

తెలుగు సినిమా రంగంలో ఆంధ్రా అధిపత్యానికి చెక్ పెట్టిన ఒకే ఒక్క నిర్మాత తెలంగాణకు చెందిన దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణా రెడ్డి. మనోడికి ముందు నుంచి సినిమా మీద ఓ అవగాహన ఉంది. అంతకంటే ఎక్కువగా ఆయన ఏది పట్టుకుంటే అది బంగారంగా మారేలా దేవుడు అలా రాసి పెట్టాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలు తెలుగు వారికి అందించాడు. అంతే కాకుండా అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటాడు. డైరెక్టర్స్ కు ఫ్రీడమ్ ఇస్తాడు. తనకు సినిమా మీద మంచి పట్టుంది. ఎప్పుడు ఏ సినిమాను తీయాలో, ఎప్పుడు రిలీజ్ చేయాలో, ఎలా జనంలోకి చొచ్చుకు పోయేలా మార్కెటింగ్ చేయాలో, చివరకు డబ్బులు ఎలా రాబట్టుకోవాలో దిల్ రాజుకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదంటే అతిశ యోక్తి కాదేమో. నిర్మాతల పరంగా చూస్తే తెలంగాణ నుంచి దిల్ రాజు ,ఆంధ్ర నుంచి మెగాస్టార్ బావ, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ప్రముఖంగా ఉన్నారు.

దిల్ రాజు ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఆ సినిమా సక్సెస్ కావాల్సిందే. అంత వరకు నిద్ర పోడు..తన టీమ్ ను నిద్ర పోనివ్వడు. తెలుగు ప్రేక్షకులకు, సినీ అభిమానులకు దిల్ రాజు సమర్పిస్తున్నాడంటే చాలు అందులో ఏదో మెస్సేజ్ వుండి ఉంటుంది. అంతే కాదు తెలుగుదనం కూడా ఉట్టి పడుతుంది. ఆఫీస్ బాయ్ దగ్గరి నుంచి డైరెక్టర్ దాకా దిల్ రాజు తానే దగ్గరుండి ఎంపిక చేసుకుంటాడు. అందుకే దిల్ రాజు దిల్ ఉన్నోడు అంటారు. డిస్ట్రిబ్యూటర్స్ పరంగా, దిల్ రాజు, అల్లు అరవింద్ లు పంచుకున్నారని విమర్శలు వచ్చినా ఇవేవి పట్టించు కోరు. వీరిద్దరికి కావాల్సిందేమిటో వాళ్లకు బాగా తెలుసు. ప్రేక్షకుల నాడి తెలుసు కనుకే సినిమాలు ఊహించని రీతిలో సక్సెస్ అవుతున్నాయి.

కొన్ని ఆడక పోయి ఉండవచ్చు. కానీ ఎక్కువ సినిమాలు మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దిల్ రాజు అద్భుతమైన సినిమాలు తీశాడు. ఇందుకు గట్స్ కావాలి. జెనీలియాతో సుకుమార్ తీసిన బొమ్మరిల్లు బిగ్గెస్ట్ హిట్. నిర్మాతగా, పంపిణీదారుడుగా, సమర్పకుడిగా ఇప్పటికే దిల్ రాజు పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో అవార్డులు తీసుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించాడు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. మొదటి సినిమా దిల్. ఇది హిట్ గా నిలిచింది. ఇక అప్పటి నుంచి దిల్ రాజు గా పేరు మార్చుకున్నాడు. సతీష్ వేగ్నేశ తీసిన శతమానం భవతి సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. ఆంద్ర డామినేషన్ ను పూర్తిగా ఎదుర్కొని ఒక్కడే ఒంటరిగా నిలబడ్డాడు.

శ్రీనివాస కల్యాణం, లవర్, ఎంసీఏ , ఫిదా, దువ్వాడ జగన్నాథం, సుప్రీం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కేరింత , పిల్లా నువ్వు లేని జీవితం, ఎవడు, కేరింత , రామయ్యా వస్తావయ్యా , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిస్టర్ పెర్ఫెక్ట్ , ఓ మై ఫ్రెండ్ , గగనం సినిమాలు తీశాడు. జూనియర్ ఎన్ఠీఆర్ తో బృందావనం తీశాడు. ఇది కూడా సక్సెస్ గా నిలిచింది. రామ రామ కృష్ణ కృష్ణ , మరో చరిత్ర , జోష్ , ఆకాశమంత, కొత్త బంగారు లోకం , పరుగు, మున్నా, భద్ర, ఆర్య, మహర్షి , శ్రీనివాస కళ్యాణం తీశాడు. డార్లింగ్, ఆర్య -2 , సారాయి వీరాజు, మల్లన్న , గణేష్ , సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఢీ, జగడం, అన్నవరం, అశోక్, పోకిరి , ఛత్రపతి, గోదావరి, అతడు, భద్ర, తదితర సినిమాలకు పంపిణీదారుగా ఉన్నారు. మొత్తం మీద తెలుగు ఇండస్ట్రీలో మనోడు దమ్మున్న ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!